Bengaluru: బాబోయ్.. బెంగుళూరులో డబుల్ బెడ్ రూం అద్దె ఎంతో తెలుసా?
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడి ఇళ్ల యజమానులకు తమ ఆదాయంలో.. ఎక్కువ అద్దెల నుంచే వస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడి ఇళ్ల యజమానులకు తమ ఆదాయంలో.. ఎక్కువ అద్దెల నుంచే వస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. డిమాండ్ ఉన్న చోట.. ఏకంగా డబుల్ బెడ్ రూమ్ అద్దె రూ. 50వేలు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
డబుల్ బెడ్రూం అద్దె రూ.50 వేలు
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడి ఇళ్ల యజమానులకు తమ ఆదాయంలో.. ఎక్కువ అద్దెల నుంచే వస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. డిమాండ్ ఉన్న చోట.. ఏకంగా డబుల్ బెడ్ రూమ్ అద్దె రూ. 50వేలు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. కరోనా ప్రభావంతో.. చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. కరోనా తర్వాత పరిస్థితులు సాధారణంగా మారడంతో.. ఇంటి అద్దెలకు డిమాండ్ ఏర్పడింది. ఇక బెంగళూరులో 2022 ఆరంభంతో పోలిస్తే దాదాపు ప్రస్తుతం అక్కడి ఇంటి అద్దె ధరలు.. రెండింతలు అయ్యింది. ఈ ధరలతో బెంగళూరు దేశంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌గా పేరుపొందింది.
బెంగళూరు ఐటీ కేంద్రానికి హబ్ గా నిలుస్తోంది. గూగుల్, అమెజాన్, గోల్డ్‌మన్ శాక్స్, యాక్సెంచర్.. ఇలా పెద్ద పెద్ద కంపెనీలకు కేంద్రంగా ఉంది.దీంతో ఈ నగరంలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఇక్కడ నివసిస్తున్నారు. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు.. ‘వర్క్ ఫ్రమ్ హోం’సదుపాయంతో సొంతూళ్లకు వెళ్లారు. కరోనా ప్రభావంతో.. ఇంటి అద్దెలు పూర్తిగా తగ్గాయి. పరిస్థితులు చక్కబడటంతో.. ఉద్యోగులంతా బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో అద్దెలు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా సమయంలో ఆదాయం కోల్పోయిన ఇంటి యజమానులు.. వాటిని తిరిగి రాబట్టే పనిలో ఇంటి అద్దెలను పెంచినట్లు తెలుస్తోంది.
ఒక్కసారిగా పెరిగిన డిమాండ్..
బెంగుళూరులో ఇంటి అద్దెలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని ఉద్యోగులు అంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి డబుల్ బెడ్రూం ఇంటిని నెలకు రూ.50 వేలకు అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు.