Last Updated:

Steve Smith: భారత్ తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

Steve Smith: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫిలో ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిన ఆ జట్టు.. మూడో టెస్టుకు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక మిగతా రెండు టెస్టులకు ఆసీస్ బ్యాట్సమెన్ స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు.

Steve Smith: భారత్ తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

Steve Smith: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫిలో ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిన ఆ జట్టు.. మూడో టెస్టుకు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక మిగతా రెండు టెస్టులకు ఆసీస్ బ్యాట్సమెన్ స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు.

ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు.. (Steve Smith)

భారత్ లో జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ ఘోర పరభావాలను మూట గట్టుకుంది. ఈ రెండు మ్యాచుల్లో కంగారు జట్టు.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఓ వైపు గాయాల బెడదతో ఇప్పటికే సతమతమవుతున్న ఆ జట్టు.. మూడో టెస్టుకు ఆ జట్టు కెప్టెన్ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన కమిన్స్.. మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని
తెలిపాడు. ఈ సిరీస్ లో ఆసీస్ ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే మిగతా టెస్టులకు డేవిడ్‌ వార్నర్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ దూరం అయ్యారు. ఆ తర్వాత.. ఆ జట్టు మరో కీలక ఆటగాడు కమిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లాడు. మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడు అనుకుంటే.. అతను ఇండియాకు రాలేకపోతున్నానని తెలిపాడు. దీంతో ఆసీస్ పలు మార్పులతో మూడో టెస్టు ఆడనుంది. మిగిలిన రెండు టెస్టులకు.. స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. తొలి రెండు టెస్టులకు దూరమైన కీలక ఆటగాళ్లు.. మిచెల్‌ స్టార్క్‌.. కామెరాన్ గ్రీన్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండనున్నారు. ఇక మిగతా రెండు మ్యాచుల్లో అయినా గెలిచి.. ప్రతికారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోతే.. భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.

కమిన్స్ రాకపోవడానికి కారణం అదేనా..

మూడో టెస్టుకు ముందు కంగారు జట్టుకు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిన కమిన్స్.. మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని వెల్లడించాడు. అతడి స్థానంలో స్టీవ్‌ స్మిత్‌ ఆసీస్ కు సారథ్యం వహించనున్నాడు. తల్లి అనారోగ్యం బారిన పడటంతో రెండో టెస్టు తర్వాత.. కమిన్స్ స్వదేశానికి తిరిగి వెళ్లాడు. కానీ తన తల్లి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అక్కడే ఇంకా కొన్ని రోజులు ఉండాలని కమిన్స్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా.. మార్చి1 నుంచి ఇండోర్‌ వేదికగా మూడో టెస్టుకు సన్నద్దం అవుతోంది. ఇక ఇప్పటికే ఆసీస్‌ జట్టుకు డేవిడ్‌ వార్నర్‌, హాజిల్‌వుడ్‌, ఆగర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు దూరమయ్యారు.

జట్టులోకి కామెరూన్ గ్రీన్..

గతేడాది భారత్‌ లో జరిగిన మ్యాచుల్లో గ్రీన్‌ అద్భుతంగా రాణించాడు. ఇతడు ఐపీఎల్‌ మినీ వేలంలో ఏకంగా 17 కోట్ల ధర పలికాడు. ఇతడిని ముంబై ఇండియన్స్‌ ​కొనుగోలు చేసింది. ఇక మూడో టెస్టు ఇండోర్‌ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 3 వన్టేల సిరీస్ కు వార్నర్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నాలుగు టెస్టుల సిరీస్ లో రెండు టెస్టు మ్యాచుల్లో మూడు ఇన్నింగ్స్ లు ఆడిన వార్నర్ కేవలం 26 పరుగులే చేశాడు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ కంకషన్‌కు గురయ్యాడు. ఆ తర్వాత ఎడమ చేతికి బంతి బలంగా తాకింది. అయినా, బ్యాటింగ్‌ కొసాగించిన వార్నర్‌ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ స్థానంలో రెన్‌షా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.