Last Updated:

Singapore: సింగపూర్ కు పోటెత్తిన భారత పర్యాటకులు

కోవిడ్‌ కు ముందు సింగపూర్‌కు చైనా టూరిస్టులు పెద్ద ఎత్తున వచ్చే వారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఇండియా ఆక్రమించింది.

Singapore: సింగపూర్ కు పోటెత్తిన భారత పర్యాటకులు

Singapore: కోవిడ్‌ కు ముందు సింగపూర్‌కు చైనా టూరిస్టులు పెద్ద ఎత్తున వచ్చేవారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఇండియా ఆక్రమించింది. సింగపూర్‌కు వచ్చే విదేశీ ప్రయాణికుల్లో భారత్‌ రెండో స్థానాన్ని ఆక్రమించింది. గత నవంబర్‌ వరకు గణాంకాలను సింగపూర్‌ టూరిజం బోర్డు వెల్లడించింది. కరోనా కంటే ముందు వరకు చైనీస్‌ టూరిస్టులు సింగపూర్‌కు పెద్ద ఎత్తున వచ్చే వారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఇండియా టేకోవర్‌ చేసింది. గత ఏడాది నవంబర్‌ వరకు సింగపూర్‌ను విజిట్‌ చేసిన ఇండియన్‌ టూరిస్టుల సంఖ్య అక్షరాలా 6,12,300. అదే సమయంలో సింగపూర్‌లో అత్యధిక రోజులు గడిపిన వారిలో కూడా ఇండియన్స్‌ ముందున్నారు.

ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి సింగపూర్‌ వచ్చే టూరిస్టు సరాసరి 5.19 రోజులు గడిపితే, ఇండియన్స్‌ మాత్రం 8.61 రోజులు గడుపుతున్నారు. ఇండోనేషియాకు చెందిన వారు 4.66 రోజులు గడిపితే, మలేషియాకు చెందిన వారు 4.28 రోజులు , ఆస్ర్టేలియాకు చెందిన వారు 4.05 రోజులు గడిపినట్లు సింగపూర్‌ టూరిజం బోర్డు వెల్లడించింది. గత ఏడాది నవంబర్‌ వరకు సింగపూర్‌కు విచ్చేసిన విదేశీ పర్యాటకుల విషయానికి వస్తే ఇండోనేషియాకు చెందిన వారు 9,86,900 మంది విచ్చేసి నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు. 4,95,470తో మలేషియా మూడవ స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఆస్ర్టేలియా 4,76,480 మంది పౌరులు సింగపూర్‌కు సెలవులు గడపడానికి వచ్చారు.

కోవిడ్‌తో ఇండోనేషియా ఇప్పటి వరకు విదేశీ పర్యాటకులను అనుమతించడం లేదు. దీంతో సింగపూర్‌ లబ్ధి పొందింది. సింగపూర్‌కు వచ్చిన పర్యాటకుల విషయానికి వస్తే ఇండోనేషియా, ఇండియా, మలేషియా, ఆస్ర్టేలియాకు చెందిన పర్యాటకులే 48 శాతం ఆక్రమించారు. గత ఏడాది సింగపూర్‌కు వచ్చిన మొత్తం విదేశీ పర్యాటకుల సంఖ్య 5.37 మిలియన్‌లుగా తేలింది. గత ఏడాది అంటే 2022 లో 4 నుంచి 6 మిలయన్‌ పర్యాటకులు సింగపూర్‌ సందర్శిస్తారని సింగపూర్‌ టూరిజం బోర్డు అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి: