హాలీవుడ్: మరోమారు క్రిస్టోఫర్ నోలన్ మ్యాజిక్.. అణుబాంబు తయారీ థ్రిల్లర్ గా “ఓపెన్ హైమర్” ట్రైలర్
హాలీవుడ్ డైరెక్టర్లలో క్రిస్టోఫర్ నోలన్ ను ఓ ప్రముఖ దర్శకుడిగా చెప్పవచ్చు. తనదైన శైలిలో కథాకథనాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించడంలో ఈ బ్రిటిష్ అమెరికన్ దర్శకనిర్మాత ప్రసిద్ధి చెందాడు. తాజాగా నోలన్ దర్శకత్వం వహించిన చిత్రం ఓపెన్‌హైమర్ ట్రైలర్ వచ్చేసింది.
Hollywood: హాలీవుడ్ డైరెక్టర్లలో క్రిస్టోఫర్ నోలన్ ను ఓ ప్రముఖ దర్శకుడిగా చెప్పవచ్చు. తనదైన శైలిలో కథాకథనాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించడంలో ఈ బ్రిటిష్ అమెరికన్ దర్శకనిర్మాత ప్రసిద్ధి చెందాడు. కాగా నోలన్ 21వ శతాబ్దపు ప్రముఖ చిత్రనిర్మాతగా గుర్తింపు పొందారు. అయితే తాజాగా నోలన్ దర్శకత్వంలో హాలీవుడ్ స్టార్ యాక్టర్ సిలియన్ మర్ఫీ హీరోగా నటించిన చిత్రం ఓపెన్‌హైమర్. ఇక ఈ చిత్రం భౌతిక శాస్త్రవేత్త, అణు బాంబు పితామహులలో ఒకరు మరియు మాన్‌హట్టన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ ఆత్మకథ ఆధారంగా రూపొందించబడింది. రాబర్ట్ ఓపెన్ హైమర్ ప్రధాన పాత్రలో సిలియన్ ముర్ఫీ కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా థ్రిల్లింగ్ ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్. 1942-1946లో అణ్వాయుధాల సృష్టికి సంబంధించిన ప్రభుత్వ ప్రాజెక్ట్ అయిన మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌కు సహకరించిన వారిలో రాబర్ట్ ఓపెన్ హైమర్ ఒకరు. మరి ఆ కాలంలో అణుబాంబును ఎలా తయారు చేశారు.. ఎన్ని శ్రమలుపడి ఏవిధంగా తయారు చేశారు.. అసలు అణుబాంబు తయారుచేయడానికి దారితీసిన పరిస్థితులేంటి.. ఆనాటి అమెరికా దేశాధ్యక్షుడికే ఆ అణ్యాయుధాలు తయారు అవుతున్నాయని తెలియకుండా ఎందుకు వాటిని తయారు చేసి ఉపయోగించాల్సి వచ్చింది.. మరి ఓపెన్ హైమర్ ఈ ప్రాజెక్టులో ఏవిధంగా కీలక పాత్ర వహించారు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్.
ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే సిలియన్ ముర్ఫీ బ్యాక్‌డ్రాప్ నిగూఢంగా ఉంచి ఓ నిర్మాణుష్య ప్రాంతంలో ల్యాబొరేటరీలో తయారు చేసిన అణ్వాయుధాలను ప్రయోగించడం, భారీ బ్లాస్ట్ లు జరపడం చేయడం వంటి వాటితో కూడిన వీడియోస్ క్లిప్స్ తో ట్రైలర్ను చూపించారు. బ్లాక్ అండ్ వైట్ విజువల్స్‌తో నిండిపోయి.. పేలుడు యొక్క భయంకరమైన శబ్దాలు, విజువల్స్.. వాస్తవిక షాట్‌లను కలిగి ఉన్నట్టుగా చూస్తున్న ప్రేక్షకులకు ఆధ్యంతం ఉత్కంఠతను క్రియేట్ చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ సీజీఐ ఎఫెక్ట్ లేకుండా బాంబు తయారీ, పేలుడు సీన్లను తీస్తాను అని క్రిస్టోఫర్ నోలన్ గతంలో ప్రకటించారు. మరి అది ఎలా సాధ్యం సీజీఐ లేకుండా ఆ సీన్లను తీయగలరా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా, నోలన్ తలచుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ మరికొందరు ట్వీట్లు చేశారు. మరి ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 21 రిలీజ్ చేయనున్న చిత్ర బృందం తేదీని వెల్లడించింది.
You can’t re create the bomb scene unless using CGI… #Oppenheimer
Nolan: pic.twitter.com/yc0fQyjaPr
— TEAM CHUCK (@Team_0_CHUCK) December 19, 2022
ఇకపోతే డన్‌కిర్క్, ఇన్‌సెప్షన్, ది డార్క్ నైట్ రైజెస్, బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ వంటి పలు చిత్రాలలో స్టార్ హీరో సిలియన్ ముర్ఫీ ప్రముఖ పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు నోలన్ చిత్రంలో ముర్ఫీ ప్రధాన పాత్ర పోషించడం కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచుతోంది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే ప్రేక్షకులు చాలా ఆసక్తి కనపరుస్తారు. మరి నోలన్ ఈ చిత్రం ద్వారా ఎన్ని అద్భుతాలు చెయ్యనున్నాడో అని యావత్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది.
They won’t fear it until they understand it. And they won’t understand it until they’ve used it. Watch the trailer for #Oppenheimer. In theaters 7 21 23. pic.twitter.com/nvbxOBCwur
— Oppenheimer (@OppenheimerFilm) December 19, 2022
ఇదీ చదవండి: ప్రభాస్ రాణి ఎవరు?.. అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ సీక్రెట్స్ రివీల్ చేసిన బాలకృష్ణ