Municipal Corporation of Delhi: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం
మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) కోసం జరిగిన ప్రతిష్టాత్మక పోరులో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఘనవిజయం సాధించింది.
Municipal Corporation of Delhi: మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) కోసం జరిగిన ప్రతిష్టాత్మక పోరులో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఘనవిజయం సాధించింది. ఆప్ అభ్యర్థులు 136స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 15ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో అధికారం కోల్పోయింది. బీజేపీ 101 వార్డులు , కాంగ్రెస్ 10, ఇతరులు 3 వార్డులు గెలుచుకున్నారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలలో 126 సీట్ల మెజారిటీ మార్కును దాటిన తరువాత ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా పార్టీని విశ్వసించినందుకు ఢిల్లీవాసులకు ధన్యవాదాలు తెలిపారు . ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు…ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రతికూల పార్టీని ఓడించడం ద్వారా, ఢిల్లీ ప్రజలు నిజాయితీగా పనిచేసి @AravindKejriwal జీని గెలిపించారు. మాకు ఇది విజయం మాత్రమే కాదు, పెద్ద బాధ్యత అని సిసోడియా అన్నారు.
ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ, బిజెపి ఎంపి మనోజ్ తివారీ, వరుసగా నాల్గవసారి బిజెపికి ఇన్ని సీట్లు ఇవ్వడం ద్వారా ఢిల్లీ ప్రజలపై విశ్వాసం చూపిన సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు అని అన్నారు.