Last Updated:

Bhadrachalam: పెరుగుతున్న గోదావరి వరద.. భద్రాచలం-వెంకటాపురం రూట్లలో బస్సుల నిలిపివేత

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న50.50 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం ఈరోజు 51.60 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 13 లక్షల 49 వేల 465 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు.

Bhadrachalam: పెరుగుతున్న గోదావరి వరద.. భద్రాచలం-వెంకటాపురం రూట్లలో బస్సుల నిలిపివేత

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న50.50 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం ఈరోజు 51.60 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 13 లక్షల 49 వేల 465 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. మరికొద్దిసేపట్లో మూడోవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతుండటంతో భద్రాచలం, చర్ల,వెంకటాపురం రూట్లలో బస్సులు నిలిపివేశారు అధికారులు. చత్తీస్‎ఘడ్, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ వెళ్ళే రహదారులను అధికారులు మూసివేశారు.

ఇవి కూడా చదవండి: