Published On:

World Cup 2027: 2027 ప్రపంచకప్ కు విరాట్, రోహిత్ దూరం: గవస్కర్!

World Cup 2027: 2027 ప్రపంచకప్ కు విరాట్, రోహిత్ దూరం: గవస్కర్!

Rohit Sharma and Viral will not Play for World Cup 2027: టెస్ట్ క్రికెట్ కు వరుసగా రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు సునీల్ గవాస్కర్. రానున్న 2027ప్రపంచకప్ లో వీరిద్దరూ ఆడకపోవచ్చని సందేహాన్ని వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ నాటికి రోహిత్, కోహ్లీల వయసు 40, 38 సంవత్సరాలు ఉంటాయన్నారు. ప్రపంచకప్ కు మరో రెండేళ్ల సమయం ఉందన్నారు. అప్పటివరకు ఇరువురూ భారీ ఫాంలో ఉంటే చెప్పలేమన్నారు.

 

virat rohit sharma world cup 2027

virat rohit sharma world cup 2027

 

ఐదురోజుల వ్యవధిలో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. మే 7న రెడ్ బాల్ ఆడబోనని రోహిత్ ప్రకటించగా, మే12న విరాట్ తన ఎక్ ఎకౌంట్ వేదికగా ప్రకటించాడు. 2024ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఈ జంట టీ20 ఫార్మట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇరువురి మార్గదర్శకత్వంలో తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ఈ టౌర్నమెంట్ ను పాకిస్తాన్ దుబాయ్ వేదికగా నిర్వహించింది.

 

virat kohli world cup 2027

virat kohli world cup 2027

 

విరాట్, రోహిత్ లు అద్భుతమైన ఆటగాళ్లని గవస్కర్ ప్రశంసించారు. “వండే ఫార్మాట్ లో విరాట్, రోహిత్ లు అద్భుతమైన ఆటగాళ్లు. వారి సహకారంతో టీమిండియా ఎన్నో విజయాలను అందుకుంది. 2027లో జరిగే ప్రపంచ కప్ కు ఇరువురి వయసు 38, 40 కి చేరుతుంది. అయితే అప్పటి వరకు ఇద్దరు ఫాంలో ఉంటేను సెలక్ట్ అవుతారు. లేకుంటే ఆడక పోవచ్చు. సెలక్షన్ కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తుంది.” అని అన్నాడు. ఇది కేవలం తన అభిప్రాయమేనన్నారు గవస్కర్.

 

rohit sharma world cup 2027

rohit sharma world cup 2027

 

టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో నేక్ట్స్ కెప్టెన్ ఎవరన్నదానిపై క్రీడా లోకంలో చర్చ సాగుతోంది. కెప్టెన్ గా శుబ్ మన్ గిల్, వైస్ కెప్టెన్ గా పంత్ ను ఎంపిక చేయవచ్చని అనుకుంటున్నారు. అయితే రేసులో భారత ఫేసర్ జస్ప్రిత్ భుమ్రా పేరు బలంగా వినపడుతుంది.

ఇవి కూడా చదవండి: