Published On:

Donald Trump on IND Pak War: భారత్- పాక్ యుద్ధం నేనే ఆపాను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump on IND Pak War: భారత్- పాక్ యుద్ధం నేనే ఆపాను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald trump on India Pakistan War: భారత్- పాక్ ఉద్రిక్తత నడుమ ఇరుదేశాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. అయితే మే 10న సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే పాక్ నిబంధనలు ఉల్లంఘించిన భారత్ అందుకు తగిన గుణపాఠం చెప్పింది.

 

అయితే తాజాగా కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ వంటి రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని తానే నిరోధించానని చెప్పుకొచ్చారు. అణుయుద్ధం జరిగితే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని అన్నారు. లక్షల మంది ప్రాణాలు పోవడమేకాక, భారీ వినాశనం కలిగేదని తెలిపారు. యుద్ధం నివారించడంలో జేడీ వాన్స్, రుబియో కృషిని మెచ్చుకున్నారు.

 

యుద్ధనివారణలో తాను పనిచేసినట్టుగా ఎవరూ చేయలేదని పేర్కొన్నారు. ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం చేశానని అన్నారు. భారత్, పాక్ తో నిరంతరం సంప్రదింపులు జరిపామని తెలిపారు. చివరికి కాల్పుల విరమణకు ఇరుదేశాలను ఒప్పించామని వివరించారు. కాల్పుల విరమణ చేయకపోతే వాణిజ్యం ఆపేస్తానని చెప్పినట్టు తెలిపారు. కాగా కాల్పుల విరమణ శాశ్వతం అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. భారత్, పాక్ విజ్ఞతను ప్రదర్శించాయని అన్నారు.