Last Updated:

Arjun Son of Vyjayanthi Teaser: కళ్యాణ్‌ రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ టీజర్ చూశారా?

Arjun Son of Vyjayanthi Teaser: కళ్యాణ్‌ రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ టీజర్ చూశారా?

Arjun Son of Vyjayanthi Teaser Out: నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. సీనియర్‌ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఇక విజయశాంతి ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మూవీ టీం టీజర్‌ విడుదల చేసింది. పవర్ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌గా సాగిన ఈ టీజర్‌ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఇందులో విజయశాంతి పవర్ఫుల్‌ మహిళా పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుందని టీజర్‌తో స్పష్టమైంది. ఈ చిత్రంతో మరోసారి వింటెజ్‌ విజయశాంతిని చూపించారు. ప్రస్తుతం ఈ టీజర్‌ మూవీపై ఆసక్తిని పెంచుతోంది.

 

“నా కెరీర్‌లో నేను ఎన్నో ఆపరేషన్స్‌ చేశాను. కానీ, చావుకు ఎదురవుతున్న ప్రతిసారీ నా కళ్ల ముందు కనిపించే ముఖ్యం నా కొడుకు అర్జున్‌” అనే విజయశాంతి డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. ఆ తర్వాత టీజర్‌ తల్లికొడుకులు అనుబంధాన్ని చూపించారు. “రేపటి నుంచి వైజాగ్‌ని పోలీసు బూట్లు, నల్లకోట్లు కాదు.. ఈ అర్జున్ విశ్వనాథ్‌ కనుసైగలు శాసిస్తాయి” అని కళ్యాణ్‌ రామ్‌ చేప్పే పవర్ఫుల్‌ డైలాగ్‌ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

ఎమోషన్స్‌, యాక్షన్‌తో పవర్‌ ప్యాక్డ్‌గా ఈ టీజర్‌ ఎడిట్‌ చేసి మూవీపై ఆసక్తిని పెంచారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ టీజర్‌ చిత్రంపై అంచనాలు పెంచేస్తోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, అశోక క్రియేషన్స్‌ పతాకాలపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సయూ మంజ్రేకర్‌, శ్రీకాంత్‌, సోహైల్‌ ఖాన్‌లు ఇతక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అంజనీస్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.