Last Updated:

US-Ukraine statement: కీలక ప్రకటన.. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం

US-Ukraine statement: కీలక ప్రకటన.. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం

Ukraine Agrees To Ceasefire Proposal: ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. ఇందులో అమెరికా మంత్రులతో పాటు అధికారుల బృందం, ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా అమెరికా 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరు పక్షాలు అంగీకారం తెలుపుతూ ఉమ్మడి ప్రకటన రిలీజ్ చేశాయి.

ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకరించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో యూఎస్ అధినేత ట్రంప్ మాట్లాడనున్నారు. మరోవైపు, సైనిక సాయం, ఇంటెలిజెన్స్ భాగస్వామ్యంపై ఆంక్షలను యూఎస్ ఎత్తివేసింది. ఈ ఒఫ్పందం విషయంపై రష్యాతో అమెరికా అధ్యక్షుడు మాట్లాడే అవకాశం ఉంది.అయితే రష్యా కూడా సీజ్ ఫైర్‌కు అంగీకరిస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జెలెన్ స్కీని మరోసారి వైట్ హౌస్ పిలుస్తామని పేర్కొన్నారు.

 

కాగా, గత నెలలో వైట్ హౌస్‌లో ట్రంప్, జెలెన్ స్కీల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఉక్రెయిన్‌తో ఖనిజాల తవ్వకంపై ఒప్పందం పెండింగ్‌లో పడింది. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా అందించే సైనిక సాయం కూడా నిలిచిపోయింది. తాజాగా, 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించడంతో సైనిక సాయం, భాగస్వామ్యం వంటి వాటిపై విధించిన ఆంక్షలను ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది.

 

ఇదిలా ఉండగా, పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ చేపడుతామని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఖనిజాల తవ్వకాల ఒప్పందంపై వీలైనంత త్వరగా రెండు దేశాలు నిర్ణయం తీసుకోనున్నాయి. అయితే అమెరికా, ఉక్రెయిన్ మధ్య జరిగిన ఈ ఒప్పందంపై రష్యాతో అమెరికా మాట్లాడనుంది. కాగా, సౌదీ అరేబియా వేదికగా జరిగిన చర్చల్లో యూఎస్ తరపున విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ పాల్గొన్నారు.