Erra Cheera Release: మళ్లీ వాయిదా పడ్డ ‘ఎర్రచీర: ది బిగినింగ్’ – కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Erra Cheera Again Postponed: నటుడు, హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో వహించిన చిత్రం ‘ఎర్రచీర-ది బిగినింగ్’. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్-శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. హార్రర్, యాక్షన్ కథతో మథర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ మనవసరాలు, మహానటి చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ సాయి తేజస్వీని ప్రధాన పాత్ర పోషిస్తోంది.
గతేడాది డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఈ శిశరాత్రికి మూవీని రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ శివరాత్రికి కూడా మూవీని విడుదల చేయడం లేదని తాజాగా మేకర్స్ తెలిపారు. సినిమాను వాయిదా వేస్తున్నట్టు తాజాగా మూవీ టీం ప్రకటన ఇచ్చింది. టెక్నికల్ కారణాల వల్ల సినిమాను ఈ శివరాత్రికి రిలీజ్ చేయలేకపోతున్నామని, వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో మూవీని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.
అయితే రిలీజ్ డేట్ ఎప్పుడనేది మాత్రం వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని, సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉందని చూసినవారు అందరూ అంటున్నారన్నారు. కాగా ఈ చిత్రంలో బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు నటించారు.