Wipro: ఉద్యోగులకు షాక్… 300 మంది టెకీలపై విప్రో వేటు
ఒకే సమయంలో రెండు కంపెనీలకు పనిచేస్తూ మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 300 మంది సిబ్బందిని గుర్తించి, వారిని తమ ఉద్యోగం నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వెల్లడించారు.
Wipro: కరోనా నుంచి చాలా మంది టెకీలు వర్క్ ఫ్రంహోంలో ఉన్నారు. ఇంక అప్పటి నుంచి ఐటీ సంస్థల ఒత్తిళ్ళు తాళలేక చాలా మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అదే ఛాన్సుగా భావించిన కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఒకే సమయంలో రెండు వేరు వేరు సంస్థల్లో కంపెనీలకు తెలియకుండా ఉద్యోగాలు చెయ్యడం మొదలుపెట్టారు.
ఇక కరోనా అనంతరం నెమ్మదినెమ్మదిగా కంపెనీలను ప్రారంభించిన సాఫ్ట్ వేర్ యాజమాన్యాలు ఈ విషయాన్ని గుర్తించాయి. ఇలా ఒకే సమయంలో రెండు కంపెనీలకు పనిచేస్తూ మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 300 మంది సిబ్బందిని గుర్తించి, వారిని తమ ఉద్యోగం నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వెల్లడించారు.
ఒకే సమయంలో తమ పోటీ సంస్థల్లోనూ విధులు నిర్వహిస్తున్నవారిని సహించేది లేదని, వారిని ఉద్యోగాల్లో తీసివేసినట్లు ఢిల్లీలో జరుగుతున్న ఏఐఎంఏ సదస్సు వేదికగా ఆయన వెల్లడించారు. ఇంటి నుంచి పనిచేస్తున్న వారిలో కొంత మంది సిబ్బంది ఇతర ఐటీ సంస్థలకు కూడా ఒకే సమయంలో సేవలు అందిస్తున్నారని అలాంటి వారిని తమ యాజమాన్యం గుర్తించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Uber: ఉబర్ కంపెనీపై సైబర్ అట్టాక్