Last Updated:

Redmi Note 13 Pro 5G: జాతరే జాతర.. 200 MP కెమెరా ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. మరీ ఇంత తక్కువ అనుకోలేదు..!

Redmi Note 13 Pro 5G: జాతరే జాతర.. 200 MP కెమెరా ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. మరీ ఇంత తక్కువ అనుకోలేదు..!

Redmi Note 13 Pro 5G: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ సమయంలో అనేక పరికరాలు, స్మార్ట్‌ఫోన్‌లను అసలు లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు ఆర్డర్ చేయవచ్చు. కావాలంటే సేల్ సమయంలో రూ.18 వేల లోపు ధరతో 200ఎంపీ కెమెరా ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. డీల్  Redmi Note 13 Proలో అందుబాటులో ఉంది. రండి దీని గురించి వివరాలు తెలుసుకుందాం.

Redmi Note 13 Pro వెనుక ప్యానెల్‌లో 200MP హై-రెస్ కెమెరా సెటప్ ఉంది. ఇది 67W TurboCharge ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ డబుల్ సైడెడ్ గ్లాస్ బాడీతో ప్రో-గ్రేడ్ డిజైన్‌ను కలిగి ఉంది.  1800నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 5G ప్రాసెసర్ కారణంగా ఈ ఫోన్ మంచి పనితీరును అందిస్తుంది.

షియోమి ఈ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో రూ. 17,805 తగ్గింపు ధరతో జాబితా చేశారు. వినియోగదారులు Redmi Note 13 Pro 5Gని దాదాపు 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ బెనిఫిట్స్ ఫోన్ Scarlet Red వేరియంట్‌పై అందుబాటులో ఉంది, ఇది 8GB RAMతో 128GB స్టోరేజ్‌ను అందిస్తుంది. అలానే మీ ఫోన్‌‌ని ఎక్స్‌ఛేంజ్ ద్వారా  గరిష్టంగా రూ.15,850 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందుతారు. ఈ తగ్గింపు విలువ పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

Redmi Note 13 Pro 5G Specifications
రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ రెడ్‌మి నోట్ లైనప్ స్మార్ట్‌ఫోన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1800నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ ఉంది. దాని వెనుక ప్యానెల్ 200MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 5100mAh కెపాసిటీ బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది.