Motorola G35 5G Sale: మంటెక్కిస్తున్న మోటో.. రూ.9,999లకే కొత్త 5జీ మొబైల్.. కొత్తగా ఏముందో తెలుసా..?
Motorola G35 5G Sale: టెక్ బ్రాండ్ మోటరోలా తన 5G స్మార్ట్‌ఫోన్ Motorola G35 5Gని గత వారం బడ్జెట్ విభాగంలో విడుదల చేసింది. దీని సేల్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుండి ఈరోజు డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల తర్వాత రూ. 10 వేల కంటే తక్కువ ధరతో ఆర్డర్ చేయచ్చు. తక్కువ ధరకే పవర్ ఫుల్ ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది.
ఈ స్మార్ట్‌ఫోన్ స్మూత్ పర్ఫామెన్స్ కోసం Unisoc T760 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 4GB RAMతో పాటు, IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. విజన్ బూస్టర్, నైట్ విజన్ మోడ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ మొబైల్ లాంగ్ లైఫ్ బ్యాటరీ బ్యాకప్ కోసం 5000mAh కెపాసిటీ బ్యాటరీని అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14తో 5G కనెక్టివిటీ ఆధారంగా సాఫ్ట్వేర్ స్కిన్‌ను కలిగి ఉంది.
Moto G35 5G Price
4GB RAM+128GB స్టోరేజ్‌తో మోటరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వేరియంట్ ధర రూ.9,999. కంపెనీ వెబ్సైట్ కాకుండా, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుండి ఆర్డర్ చేయచ్చు. అంతేకాకుండా కంపెనీ కస్టమర్లు ప్రత్యేక ఆఫర్ల ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జామ రెడ్, లీఫ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Moto G35 5G Specifications
ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేను కలిగి ఉంది, దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఇది గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ కలిగి ఉంది. 1000నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇస్తుంది. Unisoc T760 ప్రాసెసర్‌తో ఉన్న ఈ ఫోన్ Android 14 ఆధారంగా HelloUIని కలిగి ఉంది. 4GB RAMతో పాటు, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. Dolby Atmos సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు ఈ మొబైల్లో అందుబాటులో ఉన్నాయి.
కెమెరా సెటప్ గురించి మాట్లాడితే వెనుక ప్యానెల్లో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా అందించారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం కస్టమర్లు 16MP ఫ్రంట్ కెమెరా సహాయం తీసుకోవచ్చు. ఈ ఫోన్ 20W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది IP52 రేటింగ్‌తో పాటు వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో కూడిన డిజైన్‌ను అందిస్తుంది.