Realme 14 Pro Launched Soon: రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్.. అబ్బురపరుస్తున్న ఏఐ ఫీచర్స్.. లాంచ్ ఎప్పుడంటే..?
Realme 14 Pro Launched Soon: రియల్‌మి తన తాజా స్మార్ట్‌ఫోన్ Realme 14 Pro సిరీస్‌ను త్వరలో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ తాజాగా తన సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసింది. దీని ద్వారా ఫోన్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది. టీజర్‌లో ఫోన్ ఫీచర్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్‌కు శక్తినిచ్చే చిప్, దాని కెమెరా ఇమేజింగ్ గురించి కూడా వివరించింది. అలానే ఈ రాబోయే ఫోన్ ఇటీవల విడుదల చేసిన Redmi Note 14 సిరీస్ కంటే మెరుగైన కెమెరా ఫీచర్లతో మార్కెట్లోకి రానుందని కంపెనీ తెలిపింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రియల్‌మి తన కొత్త Realme 14 Pro సిరీస్‌ను భారతదేశంలో ప్రారంభించినట్లు ధృవీకరించింది. ప్రాసెసర్‌లు, కెమెరాలు, కొత్త AI ఫీచర్‌లతో ఫోన్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. నివేదిక ప్రకారం.. రియల్‌మి 14 Pro, 14 Pro Plusలు Snapdragon 7s Gen 3 ప్రాసెసర్‌పై రన్ అవుతాయి. ఇది మునుపటి వాటితో పోల్చితే మెరుగైన CPU, GPU పనితీరును అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో పెరిస్కోప్ కెమెరా లెన్స్ ఉంటాయని కంపెనీ తెలిపింది. అయితే ఇది మోడల్ పేరును వెల్లడించలేదు.
అదనంగా Realme 14 Pro సిరీస్ AI క్లారిటీ 2.0 వంటి AI కెమెరా ఫీచర్లతో కూడా వస్తుంది. ఇది పాత లేదా తక్కువ-రిజల్యూషన్ ఫోటోలను, AI ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను మెరుగుపరుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో వచ్చే అవకాశం ఉంది. అందులో 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 512GB ఉన్నాయి. ఇది రెండు కలర్ వేరియంట్‌లలో కూడా రావచ్చు. స్వెడ్ గ్రే, పెర్ల్ వైట్.
రియల్‌మి 14 ప్రో సిరీస్‌లో డబ్ల్యూ-స్టైల్ పెరిస్కోప్ జూమ్ ఉంటుంది.పెరిస్కోప్ లెన్స్‌తో పాటు, రియల్‌మి14 ప్రో సిరీస్‌లో మెరుగైన ఇమేజింగ్ కోసం AI అల్ట్రా క్లారిటీ 2.0 ఉంటుంది. అయితే టీజర్ ప్రకారం రెండు వెనుక కెమెరాలు ఉంటాయి. ఇందులో మెయిన్ సెన్సార్, పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి.
అయితే ఇందులో అల్ట్రా-వైడ్ లెన్స్ లేకపోవడం గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇది అల్ట్రా-వైడ్ ఫీచర్‌ను తీసివేయడాన్ని లేదా పెరిస్కోప్, క్రాస్-సెక్షన్‌లో లెన్స్‌ను ఇంటిగ్రేటెడ్ చేయడాన్ని సూచిస్తుంది. ఈ రియల్‌మి 14 ప్రో సిరీస్ భారతదేశంలో డిసెంబర్ లేదా జనవరిలో మార్కెట్‌లోకి రావచ్చని భావిస్తున్నారు.