Home / ట్రెండింగ్ న్యూస్
దర్శకధీరుడు రాజమౌళిని మరో ప్రతిష్టాత్మక అవార్దు వరించింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు ఎస్ఎస్ రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ప్రతిష్టాత్మకమైన వాటిలో ఒకటి. టార్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.
ఇప్పుడంటే లైట్ వెయిట్ ఫోన్లను అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాం కానీ గత ముప్పై ఏళ్ల ముందు సంగతి ఆలోచించండి. అప్పుడు ఇంత సౌకర్యాలు ఎక్కడున్నాయి చెప్పండి. అయితే మనం ఇప్పుడు చేసే మెస్సేజ్ కు ప్రత్యామ్నాయంగా ఉండే ఎస్ఎంఎస్ సర్వీస్ వచ్చి నేటికి సరిగ్గా 30ఏళ్లు అంట. అప్పట్లో వొడాఫోన్ ఇంజినీర్ ఒకరు మొట్టమొదటి సారిగా ఎస్ఎంఎస్ చేశారట.
సర్వసాధారణంగా ఏటీఎం అంటే డబ్బులు వచ్చే మెషీన్ అని మనకు తెలిసిందే. కాగా పెరుగుతున్న అధునాతన సాంకేతికతో పలురకాల ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్ అయ్యి ఇప్పుడు ఏకంగా బంగారాన్ని కూడా ఇచ్చే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. భారతదేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను శనివారం హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు.
పవన్ అభిమానులుకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు వరుసగా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. రన్ రాజా రన్, సాహోలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు
హైదరాబాదులోని శిల్పకళావేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ కిందే లెక్క అని వెల్లడించారు.
జార్ఖండ్‌కు చెందిన ఒక కుటుంబం తమ పెంపుడు కుక్క పుట్టినరోజును గొప్ప వైభవంగా మరియు ఉల్లాసంగా జరుపుకున్న వీడియో వైరల్‌గా మారింది.
వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఓ ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను అందజేసింది.
సాహితీ ఇన్ ఫ్రా పేరుతో వేలాది మంది బాధితులను మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు బూదాటి లక్ష్మీనారాయణను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోవరుడు తనను వేదికపై ముద్దుపెట్టుకోవడంతో ఒక మహిళ తన పెళ్లిని రద్దు చేసుకుంది . మంగళవారం రాత్రి దాదాపు 300 మంది అతిథుల సమక్షంలో దండలు మార్చుకునే కార్యక్రమం ముగిసింది.
కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ సిలబస్‌లో కర్ణాటక రత్న, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది.