Last Updated:

Sahitya Infra MD Arrest: సాహితీ ఇన్ ఫ్రా ఎండీ అరెస్ట్

సాహితీ ఇన్ ఫ్రా పేరుతో వేలాది మంది బాధితులను మోసం చేసిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, టీటీడీ బోర్డు సభ్యుడు బూదాటి లక్ష్మీనారాయణను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

Sahitya Infra MD Arrest: సాహితీ ఇన్ ఫ్రా ఎండీ అరెస్ట్

Hyderabad News: సాహితీ ఇన్ ఫ్రా పేరుతో వేలాది మంది బాధితులను మోసం చేసిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, టీటీడీ బోర్డు సభ్యుడు బూదాటి లక్ష్మీనారాయణను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. దీనితో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యత్వానికి కూడా బూదాటి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో రాజీనామా చేసినట్టు సమాచారం. రేపు రాజీనామాను ఆమోదించే అవకాశం ఉంది.

సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్ అయ్యారు. లక్ష్మీనారాయణను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు చేశారని సీసీఎస్‌లో నమోదైన కేసులో లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. ప్రి లాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా మోసాలకు పాల్పడింది. ప్రాజెక్ట్ మొదలు పెట్టక ముందే కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేసింది. భారీ భవనాల పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూళ్లు చేశారు.

అమీన్‌పూర్‌లో ప్రి లాంచ్ పేరుతో 2 వేల 500 మంది కస్టమర్ల దగ్గర.. 900 కోట్ల రూపాయలను సాహితీ గ్రూప్ వసూలు చేసింది. కస్టమర్ల ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాజెక్ట్ ఫెయిల్ కావడంతో 18 శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇస్తానని కస్టమర్లకు లక్ష్మీనారాయణ చెక్స్ ఇచ్చారు. చెక్కులు బౌన్స్ అవడంతో బాధితులు సీసీఎస్‌లో కంప్లైంట్ చేశారు. దీంతో లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి: