Smartphones Under 15000: కొత్త ఫోన్ కావాలా? రూ.15 వేలల్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు మాత్రం కెవ్వుకేక.. ఫుల్ డిటెయిల్స్..!

Smartphones Under 15000: గత కొన్నేళ్లుగా టెక్నాలజీ మార్కెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రతిరోజూ మన స్మార్ట్‌ఫోన్ పాతదిగా కనిపిస్తుంది. ఎందుకంటే సరికొత్త అప్‌డేట్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ అప్‌డేట్లను దృష్టిలో ఉంచుకొని పాకెట్‌లోని కొత్త ఫోన్ తేవాలని చూస్తున్నారు. అయితే బడ్జెట్ రూ.15 వేల లోపు ఉంటే లేటెస్ట్ వెర్షన్ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కొందరికి ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.15వేల లభించే స్మార్ట్‌ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Motorola G64 5G
మీరు Motorola G64 5G ఫోన్‌ను రూ. 13,999కి కొనుగోలు చేయచ్చు. ఇందులో 8 జీబీ ర్యామ్,128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 1 TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా,50MP (OIS) + 8MP వెనుక కెమెరా ఉన్నాయి. ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
OPPO K12x 5G
మీరు Oppo K12X 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపుతో లభిస్తుంది. మీరు Oppo K12X 5Gని రూ. 16,999కి బదులుగా రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో 32MP + 2MP వెనుక కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 45W SUPERVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5100mAh బ్యాటరీ అందించారు.
Realme P3x 5G
మీరు Realme P3x 5G ఫోన్ అసలు ధర. 16,999. అయితే ఇప్పుడు రూ. 13,999కి కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 17శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్‌లో 50MP వెనుక కెమెరా ఉంది. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంది.
ఇవి కూడా చదవండి:
- OnePlus 13T: వారెవ్వా.. తగ్గేదేలే.. ఐఫోన్ 16 రేంజ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 13T వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?