Published On:

Samsung Galaxy S25 Ultra Cash Back: లిమిటెడ్ ఆఫర్.. Galaxy S25 Ultra పై రూ.12,000 క్యాష్‌బ్యాక్.. వెంటనే దోచుకోండి!

Samsung Galaxy S25 Ultra Cash Back: లిమిటెడ్ ఆఫర్.. Galaxy S25 Ultra పై రూ.12,000 క్యాష్‌బ్యాక్.. వెంటనే దోచుకోండి!

Rs 12,000 Cash Back on Samsung Galaxy S25 Ultra: సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొనడానికి ఇదే ఉత్తమ సమయం. ఈ ఫోన్ పై కంపెనీ చాలా మంచి ఆఫర్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,29,999 ధరకు విడుదల చేసింది, ప్రస్తుతం ఇది రూ.1,17,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌తో కూడిన శక్తివంతమైన కెమెరా స్మార్ట్‌ఫోన్. మీరు ఈ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 

Samsung Galaxy S25 Ultra Best Offers

భారతదేశంలో Galaxy S25 Ultra పై రూ.12,000 తక్షణ క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్‌పై నో-కాస్ట్ EMI ప్రయోజనాన్ని కూడా పొందచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 24 నెలల పాటు నో-కాస్ట్ EMIని పొందవచ్చు. దీని తర్వాత మీరు ప్రతి నెలా రూ. 3,278 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రకారం, ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే. 512GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.1,29,999 కు అందుబాటులో ఉంటుంది, అయితే దీనిని రూ.1,41,999 కు ప్రారంభించారు. అదే సమయంలో, గెలాక్సీ S25 అల్ట్రా 1TB స్టోరేజ్ వేరియంట్‌ను ఇప్పుడు రూ.1,53,999 కు కొనుగోలు చేయవచ్చు, అయితే ఇది రూ.1,65,999 ధరకు ప్రారంభించారు.

 

Samsung Galaxy S25 Ultra Features

గెలాక్సీ ఎస్25 అల్ట్రా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల డిస్‌ప్లేను అందించింది. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ఉంది. ఈ ఫోన్ AI ఫీచర్లతో వస్తుంది. పనితీరు పరంగా, ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కంపెనీ One UI 7 స్కిన్‌పై రన్ అవుతుంది. దీనిలో 5,000mAh బ్యాటరీ ఉంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే ఒక రోజు సులభంగా ఉంటుంది.

 

ఈ ఫోన్ 45W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం ఈ ఫోన్‌లో 200MP + 10MP + 50MP + 50MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇది కాకుండా, దాని ముందు భాగంలో 12MP కెమెరా అందించారు. ఈ ఫోన్‌ను టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.