Samsung Galaxy M35 5G Prie Cut: భారీ డిస్కౌంట్.. రూ.16 వేలకే కొనచ్చు.. ఈ శాంసంగ్ ఫోన్ సూపర్ మచ్చా..!

Samsung Galaxy M35 5G Prie Cut: హాయ్ ఫ్రెండ్స్.. మీరు రూ.15 నుండి 20 వేల ధరలో సామ్‌సంగ్ 5G ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో శుభ వార్త ఉంది. కంపెనీ తన గెలాక్సీ M సిరీస్‌లోని ఫేమస్ 5G ఫోన్ – గెలాక్సీ M35 5G పై భారీ ధర తగ్గింపును ఇచ్చింది. లాంచ్ సమయంలో 6GB RAM +128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ వేరియంట్ ధర రూ.19,999. టెలికాం టాక్ నివేదిక ప్రకారం, ఈ వేరియంట్ ఇప్పుడు అమెజాన్ ఇండియాలో రూ.3,000 డిస్కౌంట్ తర్వాత రూ.16,999 కు అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB జీబీ ర్యామ్+ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ఇందులో, కంపెనీ 50 మెగాపిక్సెల్ కెమెరా , 6000mAh బ్యాటరీతో పాటు అనేక గొప్ప ఫీచర్లను అందిస్తోంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ ప్రైస్, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
ఈ శాంసంగ్ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. 8GB ర్యామ్+ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ప్రాసెసర్‌గా, కంపెనీ ఫోన్‌లో ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో LED ఫ్లాష్‌తో మూడు కెమెరాలను పొందుతారు.
వీటిలో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్స్. ఈ శాంసంగ్ ఫోన్ బ్యాటరీ 6000mAh. ఈ బ్యాటరీ 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI 6.1 పై పనిచేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. అలానే ఫోన్‌లో కంపెనీ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్‌ను కూడా అందిస్తోంది.