Infinix GT 30 Pro Launched: పిచ్చెక్కించే ఫీచర్లు.. బడ్జెట్లో గేమర్స్‌కి బెస్ట్ ఆప్షన్.. ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రో హైలైట్స్ ఇవే..!

Infinix GT 30 Pro Launched: ఇన్ఫినిక్స్ తన కొత్త GT సిరీస్ స్మార్ట్‌ఫోన్ Infinix GT 30 Proను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ గేమింగ్-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రో, దాని సరసమైన ధర, శక్తివంతమైన ఫీచర్లతో గేమింగ్ ప్రియులకు ఒక గొప్ప ఎంపిక. ఈ ఫోన్ ప్రత్యేక లక్షణాలు దాని 144Hz అమోలెడ్ డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 108MP కెమెరా. గేమింగ్ కోసం, ఇది 520Hz షోల్డర్ ట్రిగ్గర్స్, XBoost గేమింగ్ ఇంజిన్, X-యాక్సిస్ లీనియర్ మోటార్ కలిగి ఉంది. అదే సమయంలో క్రాఫ్టన్ దీనిని 120FPS BGMI గేమింగ్ కోసం సర్టిఫై చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరను పరిశీలిద్దాం.
Infinix GT 30 Pro Price And Offers
ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ 8GB + 256GB మోడల్ ధర రూ.24,999. కాగా 12GB + 256GB వేరియంట్ ధర రూ.26,999. ఈ ఫోన్ జూన్ 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ ,డెబిట్ కార్డులపై రూ.2000 డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, అదనంగా రూ.2000 డిస్కౌంట్‌తో మీరు ఫోన్‌ను చౌకగా పొందుతారు.
Infinix GT 30 Pro Features And Specifications
ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రోలో 6.78-అంగుళాల 1.5K LTPS అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఫోన్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రటక్షన్ అందించారు. ఇది IP64 నీరు, ధూళి నిరోధక రేటింగ్‌తో వస్తుంది, అంటే ఇది తేలికపాటి వర్షం, ధూళి నుండి రక్షించబడుతుంది. ఫోన్లో RGB లైటింగ్ అందించారు.
ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ 5G ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ప్రాసెసర్‌ను మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, రియల్మీ పి3 అల్ట్రాలో కూడా ఉపయోగించారు. ఈ ఫోన్లో 12GB వరకు LPDDR5x ర్యామ్, 256GB UFS 4.0 స్టోరేజ్ ఉన్నాయి, అలాగే 12GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అందించారు. గేమింగ్ కోసం, ఇది 520Hz షోల్డర్ ట్రిగ్గర్స్, XBoost గేమింగ్ ఇంజిన్, X-యాక్సిస్ లీనియర్ మోటార్ కలిగి ఉంది. క్రాఫ్టన్ దీనిని 120FPS BGMI గేమింగ్ కోసం సర్టిఫై చేసింది.
ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రోలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 108MP ప్రైమరీ సెన్సార్ (OIS తో), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ,వీడియో కాలింగ్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ సెటప్ గేమింగ్ కి అలాగే ఫోటోగ్రఫీ కి చాలా బాగుంది. ఫోన్ 5500mAh బ్యాటరీతో విడుదలైంది. ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా, ఇది 10W వైర్డు, 5W వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Samsung Galaxy S25 Edge: సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ఫుల్ రివ్యూ.. ఇప్పుడే గేమ్‌ని మార్చండి.. ఇలా ఉంది ఏంటి..?