OnePlus 13 Series Price Leak: వన్‌ప్లస్ నుంచి రెండు కాస్ట్‌లీ ఫోన్లు.. ధరలు చూస్తే నోరెళ్లబెడతారు పక్కా..!
OnePlus 13 Series Price Leak: వచ్చే ఏడాది, వన్‌ప్లస్ 13 సిరీస్ కింద రెండు కొత్త ఫోన్‌లు, వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఇండియా, గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల కానున్నాయి. కంపెనీ ప్రకారం.. ఫోన్లు జనవరి 7 న మార్కెట్లోకి వస్తాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్, కలర్ ఆప్షన్‌లు, లభ్యత, అనేక ప్రత్యేక ఫీచర్లు ఇప్పటికే వెల్లడయ్యాయి. లాంచ్‌కు ముందు, భారతదేశంలో బేస్ OnePlus 13 ధర కూడా వెల్లడైంది.
వివిధ RAM ప్రకారం దీని ధర మారుతుంది. వన్‌ప్లస్ 13ఆర్ ఇటీవల చైనాలో ప్రారంభించిన వన్‌ప్లస్ ఏస్ 5 రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా ఉండబోతోందని చెబుతున్నారు. అదే సమయంలో దీనికి ముందు ఫ్లాగ్‌షిప్ OnePlus 13 అక్టోబర్‌లో చైనాలో ప్రవేశపెట్టారు. రెండు స్మార్ట్‌ఫోన్ల ధరలపై ఓ లుక్కేద్దాం.
OnePlus 13 Price
ఇటీవల ఓ టెక్కీ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో అతను OnePlus 13 ధరను వెల్లడించాడు. టిప్‌స్టర్ ప్రకారం భారతదేశంలో OnePlus 13 ధర రూ. 67,000 నుండి రూ. 70,000 మధ్య ఉండవచ్చు. ఈ ఫోన్‌ని రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ చేయవచ్చు. మునుపటి OnePlus 12 12GB + 256GB, 16GB + 512GB ఎంపికలలో కూడా ప్రవేశపెట్టారు, వీటిలో మొదటి వేరియంట్ ధర రూ. 64,999, రెండవది రూ. 69,999.
OnePlus 13R Price
టిప్‌స్టర్ ప్రకార.. OnePlus 13R సింగిల్ ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది. అయితే, OnePlus 12R 8GB + 128GB, 16GB + 256GB ఎంపికలలో ప్రారంభించారు. వీటి ధర వరుసగా రూ. 39,99, రూ. 45,999. తరువాత, 8GB + 256GB వేరియంట్‌ను కూడా రూ. 42,999కి ప్రవేశపెట్టారు. స్మార్ట్ ప్రిక్స్ వెబ్‌సైట్ ప్రకారం OnePlus 13R ధర రూ. 45,990.
OnePlus 13 భారతదేశంలో ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్, మిడ్‌నైట్ ఓషన్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు, OnePlus 13R ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్ షేడ్స్‌లో వస్తుంది. రెండు ఫోన్‌లు వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
OnePlus 13లో స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ కనిపిస్తుండగా, OnePlus 13R స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoCతో వస్తుంది. రెండు హ్యాండ్‌సెట్‌లు 6,000mAh బ్యాటరీ, AI ఫోటో ఎడిటింగ్‌తో సహా అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటాయి. వన్‌ప్లస్ 13 IP68, IP69 రేటింగ్‌లను కూడా కలిగి ఉంటుంది.