Home / Weather Update
ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బయటకు రావలంటేనే భయపడేలా చేస్తున్న ఈ ఎండలకు మరో రెండు రోజుల్లో గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించింది. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నెల 19 నుంచి చిత్తూరు, తిరుపతి
తెలంగాణకు మరోసారి రెయిన్ అలెర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వర్షాలు ప్రజలను మరల ఇబ్బంది పెట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానల ధాటికి పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ తరుణంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ కారు మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయి ఉన్నాయి. కాగా రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీ వ్యాప్తంగా రెండురోజులు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి . ఈ ఏడాది పడిన వర్షాలు ఏ ఏడాది కూడా పడలేదు . ఏవి ఆగిన వర్షాలు ఆగడం లేదు . ఈ ఏడాది ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది . రెండు రోజలకొకసారి వాతావరణం మారిపోతూనే ఉంటుంది . తెలుగు రాష్ట్రాల్లో, భారీ వర్షపాతం నమోదు ఐనందున ఎల్లో అలర్ట్ చేసినట్టు తెలిసిన సమాచారం .
తెలంగాణలో వచ్చే రెండురోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయని. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో షీర్ జోన్ ఎఫెక్ట్ కొనసాగుతోందని, ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు.