Home / water crisis
Water Crisis in India scorching heatwave and poor: జలం లేకుంటే జీవమే లేదు. సమస్త ప్రాణకోటి మనుగడకు నీరే ప్రధాన ఆధారం. ప్రపంచ నాగరికతలన్నీ నదీ తీరాల వెంటే విలసిల్లాయి. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదాల మూలంగా ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రపంచపు అతిపెద్ద జనాభా గల మన దేశంలోనూ ఈ ముప్పు గతంలో కంటే ఇప్పుడు మరింత పెరుగుతోంది. వేసవి రావటానికి ఇంకా 3 నెలలుండగానే […]
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసి నగర వాసులు వేసవి ఎండల నుంచి కాస్తా ఉపశమనం కలిగించింది. అయినా నగరంలో మాత్రం నీటి కొరత ప్రజలను వేధిస్తోంది.
దేశవ్యాప్తంగా భానుడు భగభగ మంటున్నాడు. సరాసరి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు కాగా కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటిపోయింది. ఉదయం పది దాటిందంటే ఇంటి నుంచి బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే దక్షిణాది రాష్ర్టాల్లో నీటి ఎద్దడి క్రమంగా పెరుగుతోంది. రిజర్వాయర్లలో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతోంది. నీటి నిల్వలు కేవలం 17 శాతానికి దిగివచ్చాయి.