Water Crisis: దక్షిణభారతంలో నీటి సంక్షోభం.. సెంట్రల్ వాటర్ కమీషన్ హెచ్చరిక
దేశవ్యాప్తంగా భానుడు భగభగ మంటున్నాడు. సరాసరి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు కాగా కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటిపోయింది. ఉదయం పది దాటిందంటే ఇంటి నుంచి బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే దక్షిణాది రాష్ర్టాల్లో నీటి ఎద్దడి క్రమంగా పెరుగుతోంది. రిజర్వాయర్లలో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతోంది. నీటి నిల్వలు కేవలం 17 శాతానికి దిగివచ్చాయి.
Water Crisis: దేశవ్యాప్తంగా భానుడు భగభగ మంటున్నాడు. సరాసరి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు కాగా కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటిపోయింది. ఉదయం పది దాటిందంటే ఇంటి నుంచి బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే దక్షిణాది రాష్ర్టాల్లో నీటి ఎద్దడి క్రమంగా పెరుగుతోంది. రిజర్వాయర్లలో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతోంది. నీటి నిల్వలు కేవలం 17 శాతానికి దిగివచ్చాయి. పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలకు తాగు నీటి కొరతతో పాటు వ్యవసాయ రంగానికి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తాగు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ ) ఇటీవలే ఒక బులిటన్‌లో వెల్లడించింది.
అడుగంటిన నీటి నిల్వలు..(Water Crisis)
దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో నీటి మట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 17 శాతానికి దిగివచ్చాయని సీడబ్ల్యుసీ బులిటన్‌లో పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం 42 రిజర్వాయర్లను సీడబ్ల్యుసీ మానిటరింగ్ చేస్తోంది. కాగా దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం 53.334 బీసీఎం అంటే బిలియన్ క్యూబిక్ మీటర్లు కలిగి ఉన్నాయి. అయితే తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రస్తుతం ఈ రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం 8.865 బీసీఎంకు దిగిచ్చింది. మొత్తం నీటి సామర్ధ్యంలో కేవలం 17 శాతం మాత్రమే ఉంది. ఇదిలా ఉండగా గత ఏడాది ఇదే నెలలో రిజర్వాయర్లలో స్టోరేజీ విషయానికి వస్తే 29 శాతం ఉండేది. కాగా గత పది సంవత్సరాల సరాసరి నీటి సామర్థ్యం విషయానికి వస్తే 23 శాతంగా నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో నీటి పారుదలకు, మంచినీటి అవసరాలతో పాటు హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీడబ్ల్యుసీ ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాదికి వ్యతిరేకంగా తూర్పు రీజియన్‌లో చూస్తే.. అస్సాం, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం స్టోరేజీ నిల్వలు మాత్రం మెరుగుపడ్డాయి. గత ఏడాదితో పాటు పది సంవత్సరాల సరాసరి నీటి నిల్వలు పెరిగాయి. ఈశాన్య ప్రాంతాల విషయానికి వస్తే అక్కడ 23 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటిలో స్టోరే సామర్థ్యం 20.430 బీసీఎంగా ఉంది. ప్రస్తుతం అక్కడ 7.7889 బీసీఎంల నీటి నిల్వలు ఉన్నాయి. ఈ రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం 39 శాతం ఉందని సీడబ్ల్యుసీ బులిటెన్‌లో వివరించింది. గత ఏడాది 34 శాతం నీటి నిల్వలు ఉంటే… పది సంవత్సరాల సరాసరి 34 శాతంగా ఉంది.
దేశంలోని పశ్చిమ ప్రాంతానికి వస్తే గుజరాత్, మహారాష్ర్టలలోని రిజర్వాయర్లలో స్టోరేజీ సామర్థ్యం విషయానికి వస్తే ఇక్కడ 11.771 బీసీఎం ఉంది. మొత్తం 49 రిజర్వాయర్లలో సరాసరి 31.7 శాతం నీటి నిల్వలున్నాయి. గత ఏడాది నీటి నిల్వలు 38 శాతం ఉండగా.. పదేళ్ల సరాసరి నీటి నిల్వలు 32.1 శాతంగా ఉన్నాయి. ఇక ఉత్తరాది, సెంట్రల్ రీజియన్‌లకు వస్తే ఇక్కడ రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చెరువులను తీసుకుంటే సాధారణం కంటే మెరుగు, నార్మల్ లేదా సాధారణం, కొరత.. అత్యంత కొరత కేటగిరిలుగా విభజించింది.