Home / Uttarkashi Tunnel
17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రార్థనలు ఫలించి, ఎట్టకేలకు ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసుకు వచ్చే సమయం దగ్గర పడిందని ఒక అధికారి మంగళవారం తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సోషల్ మీడియా పోస్ట్‌లో కార్మికులను బయటకు తీయడానికి సొరంగంలో పైపులు వేసే పని పూర్తయింది అని ధృవీకరించారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా-బార్కోట్ సొరంగంలో నవంబర్ 12న కూలిపోయిన తర్వాత అందులో రెండు వారాలుగా చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తమ ప్రయత్నాలను వేగవంతం చేశాయి, ఇందులో భాగంగా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీయడానికి ఆరు ప్రణాళికలను పరిశీలిస్తున్నారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో టన్నెల్ నుంచి 41మంది కూలీలను బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్‌లో భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది.టన్నెల్ ముందు నుంచి అగర్ మెషిన్ ద్వారా చేస్తున్న డ్రిల్లింగ్ పనులు పూర్తి కాకముందే మెషిన్ బ్లేడ్లు ముక్కలుముక్కలుగా విరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు అన్వేషిస్తున్నారు.