Last Updated:

Uttarkashi Tunnel: ఉత్తరకాశీ సొరంగంనుంచి కార్మికుల తరలింపుకు రంగం సిద్దం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసుకు వచ్చే సమయం దగ్గర పడిందని ఒక అధికారి మంగళవారం తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సోషల్ మీడియా పోస్ట్‌లో కార్మికులను బయటకు తీయడానికి సొరంగంలో పైపులు వేసే పని పూర్తయింది అని ధృవీకరించారు.

Uttarkashi Tunnel: ఉత్తరకాశీ సొరంగంనుంచి కార్మికుల తరలింపుకు  రంగం సిద్దం

 Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసుకు వచ్చే సమయం దగ్గర పడిందని ఒక అధికారి మంగళవారం తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సోషల్ మీడియా పోస్ట్‌లో కార్మికులను బయటకు తీయడానికి సొరంగంలో పైపులు వేసే పని పూర్తయింది అని ధృవీకరించారు.

బాబా బౌఖ్ నాగ్ జీ యొక్క అపారమైన దయ, కోట్లాది మంది దేశప్రజల ప్రార్థనలు మరియు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన అన్ని రెస్క్యూ టీమ్‌ల అవిశ్రాంత కృషి ఫలితంగా, కార్మికులను బయటకు తీయడానికి సొరంగంలో పైపులు వేసే పని పూర్తయింది. త్వరలో కార్మిక సోదరులందరినీ బయటకు తీసుకువెళతారు అని ధామి హిందీలో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో చెప్పారు. డ్రిల్లింగ్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని ఎస్కేప్ పైప్ యొక్క చివరి భాగం డ్రిల్ చేసిన మార్గం ద్వారా నెట్టబడుతుందని ఒక అధికారి చెప్పారు.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బంది, తాళ్లు, లైట్లు మరియు స్ట్రెచర్లతో సిల్క్యారా సొరంగం ప్రవేశద్వారం వద్ద సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందం మొదట పైప్‌లైన్ ద్వారా కూలిపోయిన సొరంగం యొక్క అవతలి వైపుకు వెడుతుంది. చిక్కుకున్న వ్యక్తుల పరిస్థితిని అంచనా వేయడానికి మరియు సురక్షితమైన తరలింపు కోసం అవసరమైన సూచనలను అందజేస్తారు.

కార్మికుల తరలింపుకు అంబులెన్స్‌లు..( Uttarkashi Tunnel)

కార్మికులను వారిని రక్షించిన తరువాత తక్షణ వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తరలించడానికి మంగళవారం సన్నాహాలు ప్రారంభమయ్యాయి.సిల్క్యారా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్యాలిసౌర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కార్మికుల కోసం 41 ఆక్సిజన్‌తో కూడిన బెడ్‌లతో కూడిన ప్రత్యేక వార్డు సిద్ధం చేయబడింది.గత పదిహేను రోజులుగా భారీ వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో అంబులెన్స్‌లు సజావుగా వెళ్లేందుకు సొరంగం బయట ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. ఈ సొరంగం $1.5 బిలియన్ల చార్ ధామ్ హైవేలో భాగం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి. ఇది నాలుగు హిందూ పుణ్యక్షేత్రాలను 890-కిమీ రోడ్ల నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించే ప్రాజెక్టులో భాగంగా ఉంది.