Home / TSPSC posts 2022
అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా 503 పోస్టులకు గానూ మెుత్తం 2 లక్షల 86 వేల 51 మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. అయితే క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా, ప్రశ్నలు సివిల్స్ స్థాయిలో ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం పక్కపక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను అందజేయనున్నారు. కాగా ఈ ప్రశ్నాపత్రాల సెట్ల రూపకల్పనలో కూడా ఈసారి కొత్త విధానాన్ని అమలుచేయాలని కమిషన్ నిర్ణయించింది.
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ. తాజాగా విడుదలైన 181 అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయ్యింది.