TSPSC Group-1: గ్రూప్-1 పరీక్షల్లో కొత్త మార్పులు.. ఈ సారి అన్నీ జంబ్లింగే..!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం పక్కపక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను అందజేయనున్నారు. కాగా ఈ ప్రశ్నాపత్రాల సెట్ల రూపకల్పనలో కూడా ఈసారి కొత్త విధానాన్ని అమలుచేయాలని కమిషన్ నిర్ణయించింది.
TSPSC Group-1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం పక్కపక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను అందజేయనున్నారు. కాగా ఈ ప్రశ్నాపత్రాల సెట్ల రూపకల్పనలో కూడా ఈసారి కొత్త విధానాన్ని అమలుచేయాలని కమిషన్ నిర్ణయించింది. సాధారణంగా ఎ,బి,సి,డి అక్షరాలతో ప్రశ్నపత్రాల సెట్లను సిద్ధం చేస్తారు అయితే ఈసారి అందుకు భిన్నంగా 001 లేదా 101 వంటి నంబర్లతో కూడిన సెట్లను రూపొందిచనున్నారు.
దాని ద్వారా పరీక్షాకేంద్రంలో ఏ అభ్యర్థికి ఏ సెట్ వచ్చిందనే విషయం అంచనా వేయడం కష్టమవుతుంది. తద్వారా ప్రశ్నాపత్రాల కాపియింగ్ జరుగకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు వచ్చిన సెట్ నంబరును ఓఎంఆర్ షీట్ అయిన జవాబు పత్రంలో నింపాల్సి ఉంటుంది. కాగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16న జరుగనున్న విషయం విదితమే. ఈనెల 9వ తేదీ నుంచి ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీ చేయనున్నారు. మొత్తం 503 పోస్టుల కోసం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్పీ కమిషన్ వెల్లడించింది. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,041 కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుందని కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మెయిన్ పరీక్షను నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: రాత్రి 7 అయితే ఆ ఊర్లో టీవీలు, సెల్‌ఫోన్లు అన్నీ బంద్..!