Home / TS Police
తెలంగాణలో పోలీసు నియామక చివరి రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
ఇప్పటికే వాహనం నడిపేవారితో పాటు.. వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధన ఉంది. కానీ ఇది అంతంత మాత్రంగానే అమలులో ఉంది.
Ts Secretariat: రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ నెల 30వ తేదీన కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తుంది.
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్ఛార్జ్ డీజీపీగా మహేందర్ రెడ్డి స్థానంలో అంజనీకుమార్‌ని ప్రభుత్వం నియమించింది.
తెలంగాణలో కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది. జిల్లా పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.
గురువును మించిన శిష్యులు.. తండ్రిని మించిన తనయుడు.. తల్లిని మించిన కూతురు.. ఇవీ సాధారణంగా మనం ఎప్పుడు వింటూనే ఉంటాం.. ఎస్ఐ ప్రిలిమనరి పరీక్షల్లో పాసై, ఈవెంట్సో లో ఒకేరోజు తల్లీకూతుర్లు అర్హత సాధించిన ఆ తల్లీకూతుళ్ళ సక్సెస్ కథ.
తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త. పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ (PMT), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది.
దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే మాట్లాడకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా, అలాగైతే ఎస్సీ, ఎస్టీ కేసులు అందరి మీద పెట్టే దమ్ముందా అని వైఎస్ఆర్టీపి నాయకురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు
సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు పెట్టే పోస్టులపై పోలీసులు పెద్దగానే దృష్టి సారిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తులపై మాత్రం ఉదాశీనత. ఈ క్రమంలో భాజాపా పార్టీ నేతపై హైదరాబాదు పోలీసులు విద్వేష పూరిత కేసు నమోదు చేశారు.
Telanganaగోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్‌పై పెట్టిన పీడీయాక్ట్‌ను సవాల్ చేస్తూ, ఆయన సతీమణి పిటీషన్ దాఖలు చేశారు. అక్రమంగా తన భర్త పై పీడీయాక్ట్ నమోదు చేశారని, దాన్ని ఎత్తేసి బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్లో కోరారు.