Last Updated:

BJP MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్ పై హైకోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

Telanganaగోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్‌పై పెట్టిన పీడీయాక్ట్‌ను సవాల్ చేస్తూ, ఆయన సతీమణి పిటీషన్ దాఖలు చేశారు. అక్రమంగా తన భర్త పై పీడీయాక్ట్ నమోదు చేశారని, దాన్ని ఎత్తేసి బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్‌లో కోరారు.

BJP MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్ పై హైకోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్‌పై పెట్టిన పీడీయాక్ట్‌ను సవాల్ చేస్తూ, ఆయన సతీమణి పిటీషన్ దాఖలు చేశారు. అక్రమంగా తన భర్త పై పీడీయాక్ట్ నమోదు చేశారని, దాన్ని ఎత్తేసి బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్‌లో కోరారు. పిటీషన్‌ పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని మంగల్‌హాట్ ఎస్ఎచ్ఓకు నోటీసులు జారీ చేసింది. తర్వాత విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

ఆగస్టు 22న ‘‘శ్రీరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలంగాణ’’లో మహ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్. ఆ వీడియోను సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో సర్క్యులేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారనే అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను ప్రయోగించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఒక ఎమ్మెల్యే పై పీడీ యాక్ట్ నమోదుకావడం విశేషం. రాజాసింగ్ ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై 2004 నుంచి ఇప్పటివరకు మొత్తం 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. మొత్తం 101 కేసుల్లో 18 కమ్యూనల్ కేసులేనని తెలిపారు.

ఇవి కూడా చదవండి: