4 New Releases in Hyderabad: 4 సినిమాలు ఉన్నాయి.. సందడేక్కడ..?

4 Movies releasing on Tollywood but no buzz: కరోనా తరువాత ఇండస్ట్రీ కొద్దికొద్దీగా కోలుకుంటూ వస్తుంది. మూడు డబ్బింగ్ సినిమాలు .. ఆరు స్ట్రైట్ సినిమాలతో.. తెలుగు ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా థియేటర్ లో సందడి చేస్తూనే ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందా.. ? లేదా అన్నది తరువాతి విషయం.. రిలీజ్ అయ్యేవరకు కూడా సోషల్ మీడియాను షేక్ చేసిందా.. ? లేదా.. ? అనేది అసలైన విషయం.
పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి రేపు సినిమా రిలీజ్ అవుతుందని రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసేవరకు హాంగామా మాములుగా ఉండదు. అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా.. డబ్బింగ్ సినిమానా అనేది ప్రేక్షకులు పట్టించుకోరు.. ప్రమోషన్స్ చేస్తే, ప్రేక్షకుడు థియేటర్ లో కూర్చోవాలా.. ? అన్నట్లు చేయాలి. కానీ, ఈసారి వచ్చే నాలుగు సినిమాలు అలాంటి సందడిని తీసుకురాలేదు అనే చెప్పాలి.
ఈ వారంలో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు తెలుగు హీరోల సినిమాలు అయితే.. మరో రెండు సినిమాలకు తెలుగువారితో సంబంధం ఉంది. అసలు ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో అన్న విషయం కూడా సగం మందికి తెలియవు అంటే అతిశయోక్తి కాదు. అసలు ఆ సినిమాలు ఏంటి.. ? ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అనేది చూద్దాం.
జాక్:
సిద్దు జొన్నలగడ్డ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన సిద్దు.. డీజే టిల్లు సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. టిల్లు స్క్వేర్ అతడిని పర్మినెంట్ స్టార్ గా నిలబెట్టింది. అలాంటి హిట్ సినిమాల తరువాత సిద్దు నటిస్తున్న చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు అనగా ఏప్రిల్ 10 న రిలీజ్ కు రెడీ అవుతుంది. రేపు రిలీజ్ అన్నా కూడా సోషల్ మీడియాలో సందడి లేదు. అసలు బుక్ మై షో లో ట్రెండింగ్ లోనే లేదు.
మొదటి నుంచి కూడా జాక్ మీద ఎవరికీ అంత పెద్ద అంచనాలు లేవు. సిద్దు సైతం ఈసినిమాను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపించినా అవేమి పెద్ద వర్క్ అవుట్ అవ్వలేదు. అసలు సిద్దు లాంటి హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా సింపుల్ గా జరిగిపోయింది. మరి రేపు పాజిటివ్ టాక్ అందుకున్నాకా ఏమైనా ట్రెండింగ్ లోకి వస్తుందేమో చూడాలి.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి:
బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్.. ఆ తరువాత కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వస్తున్నాడు. నితిన్ – భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన దీపికా పిల్లి నటిస్తోంది. ప్రదీప్.. బుల్లితెరపై ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక కొద్దోగొప్పో ప్రదీప్ సినిమా ప్రమోషన్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. బుల్లితెరపై తనతో కలిసి పనిచేసినవారందరినీ ప్రమోషన్స్ కోసం వాడేశాడు. సుధీర్, శేఖర్ మాస్టర్, సుమ.. ఇలా తనకు తెల్సిన వారందరితో ఒక వీడియో తీసి పెట్టేశాడు. అయితే సినిమాపై మాత్రం అంత బజ్ లేదు. కామెడీ బాగా పండిందని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. అది కనుక వర్క్ అవుట్ అయ్యింది అంటే ప్రదీప్ గట్టెక్కినట్లే.
జాట్ అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ:
తెలుగు స్ట్రైట్ సినిమాలతో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు ఈ వారం రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అవే జాట్ మరియు గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాతో మొదటిసారి మైత్రీ మూవీ మేకర్స్ తమిళ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10 న రిలీజ్ కానుంది. అజిత్ తెలుగువారికి సుపరిచితుడే. అయితే ఈ మధ్యకాలంలో అతని గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మొన్నీమధ్య వచ్చిన పట్టుదల కూడా తెలుగువారిని ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా తమిళ్ లో అయితే టికెట్స్ బాగానే తెగుతున్నాయి కానీ, తెలుగులో అసలు హైప్ నే లేదు. ఇది కూడా పాజిటివ్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు చూడరు అని చెప్పొచ్చు.
జాట్.. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా కథానాయికగా నటిస్తుండగా రణదీప్ హుడా ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా కూడా రేపే రిలీజ్ కానుంది. అయితే దీని గురించి బయపడడానికి ఏమి లేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్ రావడానికి ఆలస్యం అవుతుంది. రేపు కేవలం హిందీలోనే రిలీజ్ అవుతుంది. టాక్ తో సంబంధం లేకుండా వచ్చేవారం తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అయినా ఏ ఒక్క సినిమా బజ్ ను క్రియేట్ చేయలేకపోయింది. ఈ వారం ఈ మూడు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి. ఇవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతే వచ్చేవారం రిలీజ్ అయ్యే ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాల కోసం ఎదురుచూడడమే.