Home / Telugu latest news
బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు పసిడిని కొనే ఆలోచన చెయ్యాలంటేనే అమ్మో అంటూ బెంబేలెత్తిపోతున్నారు. మరి తాజాగా దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం మీద రూ. 280 ధర పెరిగింది.
నేటి ప్రపంచంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు గూగుల్. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయిన.. ఏం తెలుసుకోవాలన్నా .. ముందు చేసే పని గూగుల్ చేయడం
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇళ్లంతా బంధుమిత్రులు ఎంతో సందడిగా ఉంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. మరి కాసేపట్లో పెళ్లి మండపానికి రావడానికి నవ వధువు ముస్తాబవుతోంది. ఇంతలోనే ఆ పెళ్లింట ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. పెళ్లిపీటలపై ఉండాల్సిన నవవధువు ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా మారింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో చోటు చేసుకుంది.
సమీప బంధువులు లేదా తెలిసినవాళ్లకు పెండ్లికి పిలవడం చూస్తుంటాం. కానీ ఆ యువ జంట మాత్రం తమ దేశాన్ని తమను ఎంతో సుఖసంతోషాలతో ఉండేలా చూస్తూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు పెండ్లి పత్రిక పంపి వివాహానికి ఆహ్వానించారు.
మీరు రూ.50 వేలకు పైబడిన చేస్తున్న ఆర్థిక లావాదేవీలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే. బ్యాంకులో ఖాతా తెరవడం మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ చెల్లుబాటు కావడం లేదా అయితే ఇప్పుడే ఆధార్ తో పాన్ ను రీ యాక్టివేట్ చేసుకోండి.
ఆధార్ కార్డ్ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇకపై ఆధార్ కలిగిన ప్రతీ ఒక్కరూ కనీసం 10 ఏళ్లకు ఒక్కసారైనా ఆధార్ బయోమెట్రిక్స్ లేదా అడ్రస్ లాంటివి అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.