Home / Tejaswi Yadav
ఉద్యోగాల కోసం భూ కుంభకోణంలో విచారణలో భాగంగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నేడు ఢిల్లీ సీబీఐ కార్యాలయం,అతని సోదరి మీసా భారతి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. మేము ఎల్లప్పుడూ ఏజెన్సీలతో సహకరిస్తాము
ఉద్యోగాల కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు జారీ చేసింది. యాదవ్‌ను ఇంతకుముందు మార్చి 4న విచారణకు పిలిచారు.అయితే అతను విచారణకు హాజరుకాకపోవడంతో తాజాగా శనివారం హాజరు కమ్మని తెలిపామన్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. సింగపూర్ ఆసుపత్రిలో తన తండ్రి లాలూ యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైందని లాలూ కుమార్తె మిసా భారతి ట్వీట్ చేశారు. లాలూ యాదవ్ రెండవ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీని తండ్రికి దానం చేసింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తన భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు ఆహ్వానం పంపించారు. బీహార్‌లోని కాంగ్రెస్ నాయకులు ఆదివారం తేజస్విని అతని తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్ మరియు రబ్రీ దేవిలను కలుసుకున్నారు
బీహార్ లో కొత్తగా ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో మూజువాణి ఓటుతో సీఎం నీతీశ్ కుమార్ విజయం సాధించారు. అయితే విశ్వాస పరీక్ష జరిగే సమయంలో ప్రతిపక్ష బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.