Home / Taliban
తాలిబన్ల పాలనలో ఆఫ్గానిస్తాన్‌లో మహిళలు, బాలికల పరిస్థితి దారుణంగా తయారైందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బాలికల ఆశలతో పట్ల ఆఫ్గానిస్తాన్ శ్మశాన వాటికలా తయారైందని టోలోన్యూస్ వెల్లడించింది. ఇక ఆఫ్గాన్ బాలికలు తమ హక్కుల కోసం ప్రధానంగా విద్య హక్కు కోసం పోరాడుతున్నారు. బాలికల విద్య పట్ల నిషేధం ఉన్నా బాలికలు మాత్రం తమ హక్కు కోసం పోరాడుతున్నారని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం వెల్లడించింది.
అప్ఘనిస్థాన్ ..తాలిబన్ల చేతిలోకి వెళ్ళాక అక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకపక్క, తాలిబన్ల ఆంక్షలు మరోపక్క, ప్రకృతి విలయాలు ఇంకోపక్క..ఇలా అన్ని విధాలుగా నానా అగచాట్లు పడుతున్నారు ఆ దేశ ప్రజలు.
అప్గానిస్తాన్‌లో తాలిబన్లు పగ్గాలు చేపట్టి ఏడాది కాలం గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రజల జీవితాలు మరింత దుర్భంగా మారిపోయాయి. మహిళలపై సరికొత్త ఆంక్షలు విధించడంతో ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. బాలికల చదువుపై ఆంక్షలు విధించడంతో పాటు స్కూళ్లను ధ్వంసం చేయడంతో చదువు