Afghanistan: తాలిబన్లకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న మహిళలు
అప్గానిస్తాన్‌లో తాలిబన్లు పగ్గాలు చేపట్టి ఏడాది కాలం గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రజల జీవితాలు మరింత దుర్భంగా మారిపోయాయి. మహిళలపై సరికొత్త ఆంక్షలు విధించడంతో ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. బాలికల చదువుపై ఆంక్షలు విధించడంతో పాటు స్కూళ్లను ధ్వంసం చేయడంతో చదువు
Prime9Special: అప్గానిస్తాన్‌లో తాలిబన్లు పగ్గాలు చేపట్టి ఏడాది కాలం గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రజల జీవితాలు మరింత దుర్భంగా మారిపోయాయి. మహిళలపై సరికొత్త ఆంక్షలు విధించడంతో ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. బాలికల చదువుపై ఆంక్షలు విధించడంతో పాటు స్కూళ్లను ధ్వంసం చేయడంతో చదువు దూరమయ్యారు బాలికలు. తాలిబన్లు అధికారంలోకి రాగానే పౌరుల హక్కులను పునరుద్దరిస్తామని హామీలు గుప్పించినా, వాస్తవాలు మాత్రం పూర్తి విరుద్దంగా ఉన్నాయి. మహిళలు మాత్రం క్రమంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతూ తమ హక్కులు పునరుద్దరించాలని పోరాడుతున్నారు.
తాలిబన్లు అధికారంలోకి రావడానికి ముందు ఫైనాన్స్‌మినిస్ర్టిలో డైరెక్టర్ ఆఫ్ పాలసీ మానటరింగ్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు 31 ఏళ్ల మోనీసా ముబారేజ్. తన హక్కులను తేలికగా వదులుకొనే ప్రసక్తిలేదని, ప్రభుత్వంతో పోరాడి తమ హక్కులను సాధించుకుంటామని పట్టుదలతో ఉన్నారు. పెద్ద పెద్ద నగరాల్లో చదువుకున్న మహిళలు, ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టున ఉన్న మహిళలు తమ సహచరుల ఇళ్లలో సమావేశమై ప్రభుత్వంపై పోరాటానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు. మహిళలు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. దీంతో పాటు మహిళల వస్ర్తధారణ కూడా సంప్రదాయబద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న బాలికల మాధ్యమిక పాఠశాలలు మూసివేసింది. కొత్త తాలిబన్ల ప్రభుత్వం కేబినెట్‌లో మహిళలకు చోటు కూడా లభించలేదు. అంతకు ముందు ఉన్న మినిస్ర్టీ ఆఫ్ విమెన్స్ అఫైర్‌ను పూర్తిగా ఎత్తివేశారు.
తాలిబన్ల పాలనలో ఒక ఏడాది పూర్తయింది. తమ హక్కుల గురించి పోరాటం సాగిస్తామని ఆఫ్గాన్ మహిళలు క్రమంగా గళం విప్పుతున్నారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై తాము చివరి శ్వాస వరకు పోరాడుతామని ముబారేజ్ అంటున్నారు. రాజధాని కాబూల్‌లో మహిళల హక్కుల పట్ల పోరాడాతున్న వారిలో ఆమె అగ్రస్థానంలో ఉన్నారు. తాలిబన్ల చేతిలో దెబ్బలు తినడంతో పాటు ఆమెను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా ఆమె మాత్రం దేనికి భయపడకుండా ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రదర్శనలు కాస్తా తగ్గాయి. చివరిగా మే 10వ తేదీన ముబారేజ్ చివరి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
మహిళలపై ప్రభుత్వ నిర్భందాలు పెరిగిపోవడంతో మహిళలు ప్రైవేట్‌గా ఒకరి ఇంట్లో కలుసుకుని మహిళల హక్కుల గురించి చర్చించుకుంటున్నారు. ఇతర మహిళలు కూడా తమ ఉద్యమంలో చేరే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అయితే గతంలో 1990 నాటి తాలిబన్లతో పోల్చుకుంటే ప్రస్తుతం తాలిబన్లు అంత కఠినంగా వ్యవహరించడం లేదు. గత నెల ముబారేజ్ ఇంట్లో మహిళలంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తమ అనుభవాలు పంచుకున్నారు. తమ స్వేచ్చ కోసం తమ హక్కులు, హోదా కోసం పోరాడుతున్నామని, తమ దేశం కోసం పనిచేస్తున్నామని, గుడచారి ఏజెన్సీ కోసం పనిచేయడం లేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మా దేశం, మా మాతృదేశం, తమకు తమ దేశంలో స్వేచ్చగా బతికే హక్కు ఉందని వారు ముక్తకంఠంతో గళం ఎత్తారు.
ఆప్థానిస్తాన్‌లోని యూఎన్ మహిళా ప్రతినిధి అలిసన్ డావిడియన్ కూడా మహిళల హక్కుల గురించి దేశవ్యాప్తంగా మహిళలు గళం విప్పుతున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ ఇంటి ముందు తలుపులు తెరుచుని బయటకు వెళ్లడం సర్వసాధారణం.. అదే ఆఫ్గాన్‌లో మాత్రం విచిత్రంగా ఉంటుందన్నారు. ఇక్కడ ఇంటి ముందు తలుపులు తీసుకుని బయటికి వస్తే నిబంధలను ధిక్కరించడం అవుతుందన్నారు. అఫ్గాన్‌లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో సంచరించేటప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉండాలో అనే అంశంపై ఖచ్చితమైన నిబంధనల్లేవు. ఉదాహరణకు ఎవరైనా మహిళ ఇంటి నుంచి బయటికి రావాలంటే పురుషుడు తోడు ఉండాలనే నిబంధన ఉంది. అయితే కాబూల్ లాంటి అర్బన్ సిటిల్లో పురుషుడు లేకుండా మహిళ ఒక్కరే ప్రయాణిస్తున్నారు.ఇది కాస్తా ఊరట కలిగించే అంశం.
ఇదిలా ఉండగా తాలిబన్లు బాలికలు, మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల, వారి హక్కులను కాలరాయడం పట్ల అంతర్జాతీయ సమాజం అఫ్గానిస్తాన్‌లో కొత్తగా ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు. దీంతో విరాళాల రూపంలో రావాల్సిన బిలియన్‌ల కొద్ది డాలర్లు నిలిచిపోయాయి. అదే సమయంలో ఆఫ్గాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. తాలిబన్ మంత్రులు, సీనియర్ అధికారులు మాత్రం మహిళల హక్కులపై తమ టాప్ లీడర్‌షిప్ నిర్ణయం తీసుకుందని, అఫ్గానిస్తాన్‌లో హక్కులన్ని షరియా చట్టం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని మంత్రులు అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా తాలిబన్ల నిర్భంధంలోతాము ఉండలేమని, ఇతర దేశాలకు వెళ్లి చదువుకుంటామని అంటున్నారు పలువురు బాలికలు. అంతర్జాతీయ సమాజం కూడా మహిళల హక్కుల కోసం, వారికి ఉద్యోగాలు, రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని తాలిబన్ల ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నాయి. వారి కృషి ఫలించి మహిళలు స్వేచ్చా వాయువు పీల్చుకోవాలని ఆశిద్దాం.