Home / Supreme court of India
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా జగన్ సర్కారు జీవో నెంబర్ వన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలానే జీవో నంబర్ 1పై ప్రతిపక్షాలు కూడా భగ్గుమన్నాయి.
’గే‘ మ్యారేజెస్ కు గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్రుపీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను స్రుపీంకోర్టుకే బదిలీ చేసుకుంది.
Supreme Court : సినిమా థియేటర్లలో బయటి ఆహారాన్ని అనుమతించే విషయంలో సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పునిచ్చింది. బయటి నుంచి తెచ్చుకునే ఆహారంపై నిషేధం విధించే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని తేల్చి చెప్పింది. గత కొంత కాలంగా థియేటర్లలో తినుబండారాలను అనుమతించే విషయం గురించి వివాదం నడుస్తోంది. కాగా 2018లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు థియేటర్స్ లోకి బయట నుంచి తెచ్చుకునే ఆహారంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో తమకు నష్టం […]
Supreme Court : 2016లో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను సుప్రీంకోర్టు
శీతాకాల సెలవుల కారణంగా డిసెంబర్ 17 నుంచి జనవరి 1 వరకు సుప్రీంకోర్టు బెంచ్ అందుబాటులో ఉండదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శుక్రవారం తెలిపారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఫలితాలను వెల్లడించవద్దని ఆదేశించింది. కార్యవర్గానికి సంబంధించి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఒక్కో స్థానానికి ఒక్కో నామినేషన్ చొప్పున మాత్రమే దాఖలయ్యాయి.
వైవాహిక వివాదాలు, బెయిల్‌కు సంబంధించిన బదిలీ పిటిషన్లను గురువారం విచారించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు హిమా కోహ్లీ, బేల ఎం త్రివేదిలతో కూడిన మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో తనపై సామూహిక అత్యాచారంచేసిన 11 మందిని విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన 20 ఫైళ్లను కేంద్రం సుప్రీంకోర్టు కొలీజియంకు తిరిగి పంపింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో కనుగొనబడిన 'శివలింగం' పరిరక్షణ కోసం గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం పొడిగించింది.