Last Updated:

Supreme Court : ’గే‘ మ్యారేజెస్ పై సుప్రీం కీలక నిర్ణయం…

’గే‘ మ్యారేజెస్ కు గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్రుపీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను స్రుపీంకోర్టుకే బదిలీ చేసుకుంది.

Supreme Court : ’గే‘ మ్యారేజెస్ పై సుప్రీం కీలక నిర్ణయం…

Supreme Court : ’గే‘ మ్యారేజెస్ కు గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సుప్రీం కోర్టుకే బదిలీ చేసుకుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషిన్ లన్నింటిపై ఫిబ్రవరి 15 లోగా సమాధానం తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి మార్చిలో విచారణ చేపడతామని తెలిపింది.

ఒకవేళ పిటిషనర్ కోర్టుకు వచ్చి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోతే.. వర్చువల్ గా పాల్గొనవచ్చని సూచించింది. స్వలింగ సంపర్క వివాహాలపై పిటిషనర్లు కానీ, కేంద్రం గానీ ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే .. రాత పూర్వకంగా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. అదేవిధంగా పిటిషన్ లో పేర్కొన్న అన్నీ విషయాలను నిశితంగా పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్ధానం కేంద్రానికి సూచించింది.

అంతకుముందు స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్ల పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వాటి​పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసుల వివరాలను తెలపాలని సూచించింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో సంబంధిత కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని సుప్రీం గుర్తుచేసింది.

ఇవి కూడా చదవండి: