Home / Srivari Brahmotsavalu
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నేడు ముగిసాయి. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం నాడు శ్రీవారికి చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకస్వాములు వైభవంగా నిర్వహించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ కోలాహలంగా సాగింది. తిరుమాఢ వీధుల్లో స్వామివారి ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు చేరుకొనే భక్తులకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు
సెప్టెంబరు 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు 20వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడ సేవ ఉంటుందన్నారు.