Tirumala: శ్రీవారి గరుడ వాహన సేవ చూతము రారండి
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ కోలాహలంగా సాగింది. తిరుమాఢ వీధుల్లో స్వామివారి ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీవారు

దేవదేవుడుని గరుడ వాహన సేవ

భక్తి పారవశ్యంతో పూజలు

దేదీప్యమానంగా తిరుమాఢవీధుల్లో ఊరేగిన శ్రీవేంకటేశుడు

కలియుగ దైవాన్ని చూడడానికి పోటెత్తిన భక్తజనం

కళాబృందాలు, మంగళవాయిద్యాల నడుమ మాఢవీధుల్లో ఊరేగిన తిరుమలేశుడు

సాంస్కృతి నృత్యప్రదర్శనతో శ్రీవారి సేవ

ఇల వైకుంఠంలోని శ్రీవారి వేషధారణ

శ్రీవారి సేవలో టీటీడీ ఛైర్మన్

మోహినీ అలంకరణలో పూజలందుకుంటున్న మలయప్ప స్వామి