Home / soaring
జంట నగరాల ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు పెరిగిపోతున్న కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో రాష్ర్ట జనాభాలో 50 శాతం మంది ప్రజలు పెరిగిన కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్నారని తేల్చింది.
గత కొద్ది కాలంగా వినియోగదారులకు చుక్కలు చూపించిన ఉల్లి, టమాటాల స్దానంలో తాజాగా వెల్లుల్లి చేరింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వెల్లుల్లి ధర సుమారుగా రూ.400 కు చేరుకుంది. ఉల్లిపాయల సరఫరాలో కొరత ఏర్పడిన తరువాత దాని స్దానంలో వెల్లుల్లి వినియోగం పెరగడంతో దీని ధర అనూహ్యంగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. దీనితో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో కిలో రూ. 155 గా ఉంది. నివేదికల ప్రకారం, ఉత్పత్తి చేసే ప్రాంతంలో వర్షం కారణంగా సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల ధర పెరిగింది.