Home / school
ఉత్తర-మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోవడంతో 20 మందికి పైగా విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు, శిధిలాలకింద 100 మందికి పైగా చిక్కుకున్నారని వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం సందర్బంగా గుర్తుతెలియని మృతదేహాలను వెలికితీసినపుడు తాత్కాలికంగా అక్కడ సమీపంలో ఉన్న బహనాగ నోడల్ పాఠశాలలో వీటిని ఉంచారు. అయితే వేసవి సెలవుల అనంతరం విద్యార్దులు, సిబ్బంది తిరిగి స్కూళ్లను తెరిచాక అక్కడ ఉండటానికి నిరాకరించడంతో దానిని కూల్చేసారు.
తాను చదువుతున్న పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఒక బాలిక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరడంతో పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పనులు ప్రారంభించింది.సీరత్ నాజ్ అనే 3వ తరగతి చదువుతున్న బాలిక పాఠశాల శిథిలావస్థలో ఉన్న తన పాఠశాల పరిస్థితిని పరిష్కరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ వీడియోను రికార్డ్ చేసింది.