Last Updated:

Balasore Train accident :బాలాసోర్‌ రైలు ప్రమాదం మృతదేహాలను ఉంచిన పాఠశాలను కూల్చేసారు.. ఎందుకో తెలుసా?

బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం సందర్బంగా గుర్తుతెలియని మృతదేహాలను వెలికితీసినపుడు తాత్కాలికంగా అక్కడ సమీపంలో ఉన్న బహనాగ నోడల్ పాఠశాలలో వీటిని ఉంచారు. అయితే వేసవి సెలవుల అనంతరం విద్యార్దులు, సిబ్బంది తిరిగి స్కూళ్లను తెరిచాక అక్కడ ఉండటానికి నిరాకరించడంతో దానిని కూల్చేసారు.

Balasore Train accident :బాలాసోర్‌ రైలు ప్రమాదం మృతదేహాలను ఉంచిన పాఠశాలను కూల్చేసారు.. ఎందుకో తెలుసా?

Balasore Train accident: బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం సందర్బంగా గుర్తుతెలియని మృతదేహాలను వెలికితీసినపుడు తాత్కాలికంగా అక్కడ సమీపంలో ఉన్న బహనాగ నోడల్ పాఠశాలలో వీటిని ఉంచారు. అయితే వేసవి సెలవుల అనంతరం విద్యార్దులు, సిబ్బంది తిరిగి స్కూళ్లను తెరిచాక అక్కడ ఉండటానికి నిరాకరించడంతో దానిని కూల్చేసారు.

కలెక్టర్ చెప్పినా వినలేదు..(Balasore Train accident)

వందలాది మృతదేహాలను ఉంచిన ప్రదేశంలో తాము చదువుకోలేమని, విధులు నిర్వర్తించలేమని వారు తెలిపారు. దీనిపై బాలాసోర కలెక్టర్ దత్తాత్రేయ షిండే స్వయంగా పాఠశాలను సందర్శించి నచ్చచెప్పినా వారు వినలేదు. వీరితోపాటు విద్యార్దుల తల్లిదండ్రులు కూడ అదే డిమాండ్ చేయడంతో దానిని కూల్చివేయడం ప్రారంభించారు. రైలు ప్రమాదం జరిగిన స్దలానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఈ పాఠశాల ఉంది. దానికితోడు వేసవి సెలవుల సమయం కావడంతో రైలు ప్రయాణీకుల మృతదేహాలను ఇక్కడ ఉంచారు.

జూన్ 2న బాలాసోర్ జిల్లాలో బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌తో కూడిన ఒడిశా రైలు ప్రమాదంలో 280 మందికి పైగా మరణించారు.1000 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సీబీఐ విచారణ చేపట్టింది.