Home / sankranthi festival
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైకాపా - జనసేన మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంటుంది. కాగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన భామిని మండలం లో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
టాలీవుడ్ లో సంక్రాంతి ప్రేక్షకులకు మంచి మాస్ మీల్స్ ని అందించింది. సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు. అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు.
సంక్రాంతి అంటే చాలు గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేలే గుర్తొస్తాయి.ఓ పక్క ప్రభుత్వం కోడి పందేలు నిషేదం అని చెప్పినా.. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని.. ఎలా వదలుకుంటాం అంటున్నారు పందెం రాయుళ్లు. దానితో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పందేలు కాస్తుంటే.. మరికొందరు బహిరంగంగానే.. పుంజులను బరుల్లోకి దింపుతున్నారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎప్పుడు ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలిచే వర్మ.. ఈసారి కొత్తగా మరోపని చేశారు. ఎప్పుడు పబ్ లలో, ఫంక్షన్ లలో కనిపించే వర్మ.. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా కాకినాడలో సందడి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో ఆంక్షలున్నప్పటికీ.. కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోడి పందాలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. వీధి ఆడే వింటిహ నాటకంలో ఎవరు ఎప్పుడు అశువులు బాస్తారో చెప్పలేం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగి శుభాకాంక్షలు చెప్పారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.