Home / Sangareddy
: తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పేదలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో మల్లికార్జున ఖర్గే ప్రసగించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కొరడాతో కొట్టుకున్నారు. రాహుల్ యాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా పోతురాజులు రాహుల్ ను కలిసినపుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వారిగురించి రాహుల్ కు వివరించారు.
ఈ రోజు తెల్లవారు జామున తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు – కారు ఢీ కొని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మహబూబ్ నగర్లో ట్రావెల్ బస్సు బోల్తా పడి 40 మంది గాయపడ్డారు.
రాష్ట్రంలో చలికాలం ప్రారంభమయ్యింది. శీతాకాలం వస్తూవస్తూనే ప్రజలను భయపెడుతోంది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడే పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తుంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారు గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ దారుణం జరిగింది. వివాహితపై సామూహిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఐఐటీ హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన మెగా కపూర్. ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.