Last Updated:

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్ విద్యార్ది ఆత్మహత్య

ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన మెగా కపూర్‌. ఐఐటీలో బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్ విద్యార్ది ఆత్మహత్య

Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన మెగా కపూర్‌. ఐఐటీలో బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం గుర్తించిన స్థానికులు, హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గతనెల 31న ఎంటెక్‌ విద్యార్థి రాహుల్‌ తానుంటున్న హాస్టల్‌ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన అతను ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

ఇవి కూడా చదవండి: