Home / Road Accident
Road Accident In Palnadu District 4 Killed: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండంలోని బ్రాహ్మణపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి ఎదురుగా చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ […]
Road Accident in Anantapur District: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలిలో ఇద్దరు మృతి చెందగా, దవాఖానకు తీసుకెళ్తుండగా మరో ఇద్దరు, చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పనికి పోయి.. కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి […]
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం చౌరస్తా వద్ద హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని మరో లారీని ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా 100 కు పైగా మేకలు కూడా చనిపోయాయి.నాగ్‌పూర్‌కు చెందిన డ్రైవర్ శుక్లాల్ మినహా మరణించిన మరియు గాయపడిన వారందరూ మధ్యప్రదేశ్ కు చెందిన వారని తెలుస్తోంది
కృష్ణా జిల్లా పెడన మండలం కృత్తివెన్ను వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్లిన యాదగిరిగుట్టకు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాద్గిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్యనిన్న రాత్రి కూరగాయలు తీసుకొని తిరిగి ఇంటికొస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టడంతో సౌమ్య స్పాట్లోనే చనిపోయింది.
చత్తీస్‌గఢ్‌లో పికప్ వ్యాన్ బోల్తా పడ్డంతో సుమారు 18 మంది మృతి చెందారు. వారిలో 17 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.. నలుగురికి గాయాలు అయ్యాయని చత్తీస్‌గఢ్‌లోని కబీర్‌థామ్ జిల్లాలో పికప్ వ్యాన్ లోయలోపడ్డంతో జరిగిన ఘటనతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అధికారులు సోమవారం నాడు చెప్పారు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారి పై గుత్తి మండలం బాచుపల్లి దగ్గర కారు, లారీ ఢీ కొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.
నెల్లూరు జిల్లా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కొడవలూరు జాతీయ రహదారిపై లారీని ఎమ్మెల్సీ కారు ఢీకొట్టింది. ఈప్రమాదలో పిఏ వెంకటేశ్వర్లు అక్కడిక్కడే మృతి చెందగా డ్రైవర్,ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో బొగ్గుతో కూడిన ట్రక్కును బస్సు ఢీకొనడంతో కనీసం 12 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు.గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజన్ ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని గోలాఘాట్ ఎస్పీ రాజేన్ సింగ్ తెలిపారు.
థాయ్‌లాండ్‌లో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కనీసం 14 మంది మృతి చెందగా, 32 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.దేశంలోని పశ్చిమ ప్రావిన్స్‌లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్‌లో అర్ధరాత్రి అర్ధరాత్రి ప్రమాదం జరిగింది.