Home / Road Accident
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మల్కాపూర్ పట్టణంలోని ఫ్లై ఓవర్పై చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ విషాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండడం మరింత విషాదాన్ని నింపింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం
కరీంనగర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో
కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ కెన్యాలోని కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాగా రద్దీగా ఉండే జంక్షన్లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్వాలియర్ నుంచి తికమ్గఢ్కు వెళ్తున్న మినీ ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో
ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలోని దిగపహండిలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కోడుమూరు సమీపంలో పెట్రోల్ బంక్ దగ్గర బొలెరో వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. కాగా క్షతగాత్రులను చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండల పరిధిలోని మడికి నేషనల్ హైవేపై వ్యాన్, కారు ఢీకొన్నాయి. అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వ్యాన్లో కొత్తపేట మండలం మందపల్లికి దైవదర్శనం కోసం వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న టూవీలర్ను తప్పించబోయి రోడ్డు పక్కన పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. నీటి కాలువలోకి వెళ్లి ఆగిపోయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు కూడా ఉండగా.. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలియటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.