Home / Rajasthan
Leopard vs Cow: మనందరం చిన్నతనంలో ఆవు పులి కథలు వినే ఉంటామ్. ఆ కథలో ఆవును పులి చంపాలనుకుంటుంది. దానికి ఆవు తన బిడ్డకు పాలిచ్చి తిరిగి వస్తానని చెప్పి.. బిడ్డకు పాలిచ్చి మళ్లీ పులి దగ్గరకు వస్తుంది.. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా తన బిడ్డను చంపడానికి దాడిచేసిన చిరుత పులికి ఆవు చెమటలు పట్టించింది. తన బిడ్డపై దాడిచేసిన చిరుతకు ఒక్కసారిగా ఆవు ఎదురు తిరగడంతో చిరుత భయపడి అడవీలోకి పారిపోయింది. […]
Rajasthan School Building Collapses: రాజస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఝాలవర్లో ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రభుత్వ పాఠశాల భవనం పై కప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది విద్యార్థులు శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. మొత్తం 60 నుంచి 70 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని స్థానిక గ్రామస్తులు ఆరోపించారు.
Army Plane crashes in Rajasthan: రాజస్తాన్ రాష్ట్రంలో భారీ ప్రమాదం జరిగింది. రతన్‌గఢ్ సమీపంలో ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలి పేలిపోయింది. భారీ శబ్దంతో ఐఏఎఫ్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో పైలెట్ మృతి చెందాడు. ప్రమాదానికి గురయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ గా అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఫైటర్ జెట్ […]
Ashok Gehlot, Sachin Pilot Meet : రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మొదట మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలే గుర్తుకొస్తాయి. ఈ క్రమంలో శనివారం వీరిద్దరూ భేటీ అయ్యారు. గెహ్లాట్ నివాసంలో జరిగిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు పెట్టారు. తన తండ్రి, మాజీ కేంద్రమంత్రి రాజేశ్ పైలట్ 25వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి […]
Nursing staff rapes woman undergoing treatment in ICU : రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళపై నర్సింగ్ స్టాఫ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈఎస్ఐసీ మెడికల్ కళాశాలలో ఓ మహిళ (32) ఐసీయూలో చికిత్స పొందుతుంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు బయట వేచి ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ నర్సింగ్ సిబ్బంది ఐసీయూలోకి […]
Government servant Arrested : భారత్‌లో విస్తరించిన పాక్ నిఘా సంస్థలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని అరెస్టు చేశారు. తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతడి ఫోన్లో పాక్‌కు చెందిన పలు నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ మగళియార్ గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతడు స్టేట్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. […]
4 Laborers Died in Rajasthan While Searching Gold: సెప్టిక్ ట్యాంక్‌లో బంగారం కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, ఊపిరాడక నలుగురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జైపుర్‌లోని ఒక బంగారం షాపు యజమాని వికాస్ మెహతా బంగారం, వెండిని తమ సిబ్బంది ప్రాసెసింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అందులో కొంత బంగారం సెప్టిక్ ట్యాంక్‌లో పేరుకుపోయినట్లు గుర్తించారు. బంగారాన్ని బయటకు తీయాలని సోమవారం […]
Woman cheated 25 people in the name of Marriage: ఓ మహిళ వివాహాల పేరుతో 25మందిని మోసం చేసి పోలీసుకు చిక్కింది. అత్తగారి ఇంట్లో అమాయకురాలిగా నటించింది. ఈ క్రమంలోనే అత్తగారి ఆస్తులు, నగదుకు సంబంధించిన రహస్యాలు తెలుసుకొనేది. అందరి మెప్పు పొందిన తర్వాత తన గ్యాంగ్ సాయంతో నగదు, డబ్బుతో పరారు అయ్యేది. ఇప్పటి వరకు అనేకమంది జీవితాలతో ఆటలాడిన కిలాడీని రాజస్థాన్‌లోని మాధోపుర్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అమాయకులను మోసం […]
Gas cylinder explodes in Rajasthan : బంగారం దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి 8 మంది మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ బికనీర్ జిల్లాలోని మదాన్ మార్కెట్ ఏరియాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ పేలుడు ధాటికి దుకాణం ఉన్న భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. బంగారం దుకాణంలోని గ్యాస్ స్టవ్‌పై పాత బంగారం, వెండిని కరిగించేందుకు వ్యాపారి మరగబెడుతున్నాడు. ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయిందని […]