Home / Rahul Gandhi
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్టకు దరఖాస్తు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు, అతను వయనాడ్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగితే, అమేథీ పట్టిన గతే ఈ నియోజకవర్గానికి పడుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం రాత్రి ట్రక్కు డ్రైవర్లను సందర్శించి వారి సమస్యలను తెలుసుకునేందుకు, వారి మన్ కీ బాత్ వినేందుకు వెళ్లారు. పార్టీ ట్వీట్ చేసిన విజువల్స్‌లో, గాంధీ ట్రక్కులో కూర్చొని, డ్రైవర్లలో ఒకరితో ప్రయాణిస్తూ మరియు ట్రక్ డ్రైవర్లతో మాట్లాడుతూ కనిపించారు.
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రధాని కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. త్రిభుజాకారంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది.
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 32 వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు.
Rahul Gandhi: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు.. మెుదటి క్యాబినెట్ సమావేశంలో చట్టాలుగా మారనున్నాయని రాహుల్ అన్నారు.
కర్ణాటక రాష్ట్ర 24 వ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోకి కంఠీరవ స్టేడియంలో రెండో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Karnataka New CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య డికె శివకుమార్ కంటే ముందున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ సిద్ధరామయ్యకు సీఎం పదవి కోసం మద్దతిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయంతో దేశరాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాయలం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.